PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8b86f96f-40e7-43d7-ad46-94d14d68e5a5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8b86f96f-40e7-43d7-ad46-94d14d68e5a5-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ భారతదేశంలో కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటిస్తూ తమని తాము సంరక్షించుకుంటున్నారు. అయితే అందరి కంటే ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారే కరోనా బారిన పడకుండా చాలా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలోనే కరోనా తీవ్రత అధికంగా ఉంటుందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సంస్థ వెల్లడించింది. కరోనా బారినపడిన డయాబెటిస్ రోగులలో 7 శాతానికి పైగా మరణ రేటు నమోదయిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. మధుమేహ వ్యాధిగcoronavirus;india;dance;heart;doctor;sugar;cheque;oxygen;insulin;chris lynn;shakti;coronavirus;kaliకరోనా: ఈ 5 లక్షణాలు అస్సలు విస్మరించవద్దు!కరోనా: ఈ 5 లక్షణాలు అస్సలు విస్మరించవద్దు!coronavirus;india;dance;heart;doctor;sugar;cheque;oxygen;insulin;chris lynn;shakti;coronavirus;kaliMon, 17 May 2021 13:22:00 GMTకరోనా వైరస్ భారతదేశంలో కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటిస్తూ తమని తాము సంరక్షించుకుంటున్నారు. అయితే అందరి కంటే ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారే కరోనా బారిన పడకుండా చాలా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలోనే కరోనా తీవ్రత అధికంగా ఉంటుందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సంస్థ వెల్లడించింది. కరోనా బారినపడిన డయాబెటిస్ రోగులలో 7 శాతానికి పైగా మరణ రేటు నమోదయిందని గణాంకాలు పేర్కొంటున్నాయి.


మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు బీపీ వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఈ అనారోగ్య సమస్యల కారణంగా శరీరం ఏ వైరస్‌లతోనూ పోరాడలేదు. ఫలితంగా వారి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కాదు మైల్డ్‌ షుగర్‌ వ్యాధి ఉన్నా.. కరోనా తీవ్రత అధికమవుతుంది. అందువల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. ఐతే కరోనా సోకిన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 5 లక్షణాలను అసలు విస్మరించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.



1. డయాబెటిస్ రోగులలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి బాగా క్షీణిస్తుంది.  అప్పుడు కరోనా వైరస్ క్లోమాలపై దాడి చేసి మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి రోగులు తమ రక్తంలో గ్లూకోజు స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం.



2. కరోనా తీవ్రత అధికమయితే చర్మంపై దద్దుర్లు.. చేతి, కాలి గోర్లు పాడవటం జరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు చర్మంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, గాయాలు చాలా నెమ్మదిగా నయం అవుతాయి. ఈ లక్షణం తలెత్తితే వెంటనే వైద్యుడి సలహా తీసుకోవడం శ్రేయస్కరం.



3. మధుమేహంతో బాధపడుతున్న కరోనా రోగులకు కోవిడ్ న్యుమోనియా ప్రాణాంతకంగా మారుతోంది. రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే.. కరోనా వైరస్ కి ఊపిరితిత్తులపై దాడి చేయడం సులభతరం అవుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తమ బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంచుకోవాలి.



4. రక్తంలోని ఆక్సిజన్ స్థాయి తగ్గితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే ఊపిరాడకపోవడం, చెస్ట్ నొప్పి రావడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూసుకోవాలి.



5. కరోనా నుంచి కోలుకుంటున్న దశలో ఉన్న వారికి.. కరోనా నుంచి కోలుకున్న వారికి.. లేదా స్టెరాయిడ్ థెరపీ పొందుతున్న వారికి బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ ని సంప్రదించాలి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>