PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-babu-2f75d872-e2c7-4c8a-a89b-6941dea43701-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-babu-2f75d872-e2c7-4c8a-a89b-6941dea43701-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు గత పదేళ్ళుగా ఏ మాత్రం మారడం లేదు. అవతల పక్క చంద్రబాబు ఉంటే ఇవతల జగన్ ఉన్నారు. మరో వైపు చూస్తే జగన్ తానూ తన పార్టీ అన్నట్లుగా వేరుగానే ఉంటారు. ఆయనకు ఇతర పార్టీలతో ఏ రకమైన రాజకీయ సంబంధాలు లేవు. jagan babu;pawan;amala akkineni;kalyan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;congress;telugu;tdp;ycp;allu sneha;janasena party;cpi;loukyam;partyజగన్ వర్సెస్ అదర్స్...?జగన్ వర్సెస్ అదర్స్...?jagan babu;pawan;amala akkineni;kalyan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;congress;telugu;tdp;ycp;allu sneha;janasena party;cpi;loukyam;partyMon, 17 May 2021 21:00:00 GMTఏపీ రాజకీయాలు గత పదేళ్ళుగా ఏ మాత్రం మారడం లేదు. అవతల పక్క చంద్రబాబు ఉంటే ఇవతల జగన్ ఉన్నారు. మరో వైపు చూస్తే జగన్ తానూ తన పార్టీ అన్నట్లుగా వేరుగానే ఉంటారు. ఆయనకు ఇతర పార్టీలతో ఏ రకమైన రాజకీయ సంబంధాలు లేవు.

ఆయన ఎవరితోనూ దోస్తీ కట్టరు. అదే విధంగా ఎవరినీ దగ్గరకు చేరనీయరు. విపక్షం లో ఉన్నపుడు కూడా ఆయన ఎపుడూ కూటములు కట్టలేదు. అలాగే అధికారంలో ఉన్నపుడు లౌక్యంగా పాలన సాగించడానికి కొన్ని పార్టీలను మచ్చిక చేసుకోలేదు. మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ యాంటీ జగన్ పాలసీని గట్టిగా  అమలు చేస్తోంది. మిగిలిన పార్టీలను ఈ క్యాంప్ లోకి తేవడంలో విజయం సాధించింది. గతంలో బీజేపీ కొంత తటస్థంగా ఉండేది. కానీ ఇపుడు బీజేపీ కూడా జగన్ మీద విరుచుకుపడుతోంది. అలాగే వామపక్ష పార్టీలలో సీపీఎం మాత్రం న్యూట్రల్ గా ఉంటే సీపీఐ బాబు టీడీపీతో పాటే అడుగులు వేస్తోంది.

ఇక జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి యాంటీ జగన్ అనే దాని మీద నిలబడి ఉన్నారు. ఆయన బీజేపీతో ఉన్నా వామ‌పక్షాలతో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో స్నేహం చేసినా తన వైసీపీ వ్యతిరేక సిద్ధాంతాన్ని మాత్రం వీడలేదు. ఈ నేపధ్యంలో ఏ చిన్న సమస్య వచ్చిన ఏపీలో విపక్షాలు అన్నీ కలసి అధికార పార్టీ మీద దాడి చేస్తున్నాయి. ప్రభుత్వం అందరికీ కలసి జవాబు చెప్పాల్సి వస్తోంది.

అయితే ఈ రకమైన రాజకీయం మంచిదేనా  అంటే వైసీపీకే ఇది మేలు చేస్తుంది అంటున్నారు. ఏపీలో జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా ఉంటే కచ్చితంగా జగన్ కి పడాల్సిన ఓట్లు ఆయనకే పడతాయి. వ్యతిరేక ఓట్లలోనే చీలిక వస్తుంది అంటున్నారు. ఈ రోజు జగన్ వ్యతిరేక కూటమిలో బీజేపీ వామపక్షాలు కాంగ్రెస్ ఉండలేవు. ఒకరు ఉంటే మిగిలిన వారు వేరు పడతారు. దాంతో చంద్రబాబు అన్ని పార్టీలని కలిపి గ్రాండ్ అల‌యెన్స్ ఏర్పాటు చేయాల‌నుకున్నా కుదరదు అంటున్నారు. అదే సమయంలో చూసుకుంటే ఈ చీలిక వల్ల అధికార పక్షం రాజకీయంగా లాభ పడుతుంది అన్న వాదన ఉంది. ఇంకో వైపు అన్నీ పార్టీలు కలిపి దాడి చేస్తూంటే సహజంగా సానుభూతి కూడా వైసీపీకి ఉంటుంది అంటున్నారు. మరి అంతా కలసి జగన్ మీద పోరు చేయాలని బాబు వ్యూహం రూపొందిస్తున్నారు కానీ అది వర్కౌట్ అయి కూటమికి లాభిస్తుందా అన్నది 2024 ఎన్నికలే చెప్పాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>