PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharashtra8525f296-48f4-44d0-b12c-95221acf8574-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maharashtra8525f296-48f4-44d0-b12c-95221acf8574-415x250-IndiaHerald.jpg దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయినా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్..maharashtra;mumbai;bharatiya janata party;maharashtra - mumbai;devendra fadnavis;government;chief minister;maharashtra;oxygenఆ విషయంలో రాజకీయాలు చేస్తారా..? రాష్ట్ర ప్రభుత్వంపై ఫడ్నవీస్ ఫైర్!ఆ విషయంలో రాజకీయాలు చేస్తారా..? రాష్ట్ర ప్రభుత్వంపై ఫడ్నవీస్ ఫైర్!maharashtra;mumbai;bharatiya janata party;maharashtra - mumbai;devendra fadnavis;government;chief minister;maharashtra;oxygenMon, 17 May 2021 20:06:52 GMTముంబై: దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయినా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. అంతేకాకుండా దేశంలో రోగులకు కావలసిన ఆక్సిజన్, టీకాలు, వెంటిలేటర్ల కొరత ఉన్న విషయం తెలిసిందే.
 

అయితే మహరాష్ట్రలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, దీని బారిన పడిన వారికి చికిత్స చేయడానికి కావలసిన వెంటిలేటర్లు కూడా అందుబాటులో లేవని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ తెలిపారు. అయితే ఇటీవల రాష్ట్రానికి పీఎం కేర్స్ నుంచి పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా వాటి పంపిణీ విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయొద్దని, స్వలాభం పొందేందుకు అమాయకపు ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన సూచించారు.

 

అయితే ఈ వెంటిలేటర్లు వచ్చిన నాలుగు నెలల వరకు అందుబాటులోకి రాలేదు. దాంతో రాష్ట్రానికి వచ్చిన 5 వేల వెంటిలేటర్లను సరిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. దాంతో పాటుగా ప్రజల బాధను గుర్తించాలని, కరోనా బాధితులకు కావలసిన వైద్య సదుపాయాల విషయంలో ఎటువంటి రాజకీయం చేయొద్దని, ప్రతి ఒక్కరికీ అన్ని సమానంగా అందేలా చూడాలని అన్నారు. ఇప్పటి వరకు కరోనా చికిత్స విషయంలో అనేక రాజకీయాలు చేశారని, కానీ ఇకపై అవి చెల్లుబాటు కావని ఫడ్నవీస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.



ఇదిలా ఉంటే మహారాష్ట్రలో గత 24 గంటల్లో 34,389 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 53.8 లక్షలకు చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 974 మంది మరణించగా మరణాల సంఖ్య 81,486కు చేరింది. అంతేకాకుండా రాష్ట్రంటో 24 గంటల్లో 59,318 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మహరాష్ట్రలో కేసులను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను విధించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ వర్సెస్ అదర్స్...?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>