PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bail-5f8145ec-d5bd-4408-b83b-b2145b9a9394-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bail-5f8145ec-d5bd-4408-b83b-b2145b9a9394-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. నెల రోజుల క్రితం రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు జగన్ కి సీబీఐ కి కూడా నోటీసులు జారీ చేసింది. bail;raghu;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;court;cbi;king;arrest;ycp;partyబెయిల్ రద్దు పిటిషన్... ఏం జరుగుతోంది.... ?బెయిల్ రద్దు పిటిషన్... ఏం జరుగుతోంది.... ?bail;raghu;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;court;cbi;king;arrest;ycp;partyMon, 17 May 2021 20:00:00 GMTవైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. నెల రోజుల క్రితం రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు జగన్ కి సీబీఐ కి కూడా నోటీసులు జారీ చేసింది.

దీని మీద ఈ మొదటి సారి ఈ నెల 7న విచారణ జరగగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని అటు జగన్ తరఫున న్యాయ వాదులు, ఇటు సీబీఐ న్యాయవాదులు కూడా కోరారు. దానికి అంగీకరించిన కోర్టు ఈ నెల 17 వరకూ టైమ్  ఇచ్చింది. ఈ రోజు కూడా మరికొంత టైమ్ కావాలి కోరడడంతో ఈ నెల 26కు కోర్టు కేసును వాయిదా వేసింది. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా  ఉన్నాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇదే ఆఖరి ఆవకాశమని కూడా కోర్టు పేర్కొంది.

దాంతో ఈ నెల 26న ఏం జరగబోతోంది. అసలు కౌంటర్ దాఖలు చేయడానికి ఏ అంశాలను ప్రస్థావనకు తెస్తారు అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి చూసుకుంటే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఇపుడు ఏపీలో హాట్ హాట్ టాపిక్ గా ఉంది. మరో వైపు పిటిషన్ దాఖలు చేసిన రఘురామ క్రిష్ణం రాజును ఇపుడు ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ రెండు అంశాలు కూడా వేడిని రాజేస్తున్నాయి. మరో వైపు రాజు అరెస్ట్ వేళ విపక్షం అతిగా స్పందించడంతో పాటు తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడింది.

ఈ నేపధ్యంలో రాజు జగన్ బెయిల్ రద్దు కోరుతూ వేసిన పిటిషన్ వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తానికి చూస్తే రాజు అరెస్ట్ విషయంలో విపక్షాలు హడావుడి చేయడంతో ఇపుడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వెనక కూడా రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అన్న  అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మరి  ఈ నెల 26న ఏం
జరుగుతుంది అన్నది చూడాలి.
 










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ వర్సెస్ అదర్స్...?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>