PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronaf65553c1-a7ad-4d37-b1fc-eda6b16c0e75-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronaf65553c1-a7ad-4d37-b1fc-eda6b16c0e75-415x250-IndiaHerald.jpgకరోనాను జయించినప్పటికీ దాని తాలూకు దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉన్నాయి. తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం, దగ్గులాంటివి వస్తూనే ఉన్నాయి. కొంత‌మందిలో ఇవి దీర్ఘ‌కాలం ప్ర‌భావం చూపిస్తుండ‌గా మ‌రికొంద‌రిలో కొద్దివారాలుంటున్నాయి. కొవిడ్ బారిన ప‌డి కోలుకున్నారిలో 10శాతం మందికి ఏదో ఒక రూపంలో స‌మ‌స్య త‌లెత్తుతోంది. గుండె, ఊపిరితిత్తుల్లో స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుండ‌టంతోపాటు స్టెరాయిడ్స్ వాడిన‌వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయి గ‌ణ‌నీయంగా పెరుడుతున్న‌ట్లు వైద్య‌నిపుణ‌లు గుర్తించారు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డినా ఎప్ప‌corona;tiru;mandula;heart;proteinకోలుకున్నా వెంటాడుతున్న కరోనా?కోలుకున్నా వెంటాడుతున్న కరోనా?corona;tiru;mandula;heart;proteinSun, 16 May 2021 09:58:38 GMT
కరోనాను జయించినప్పటికీ దాని తాలూకు దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉన్నాయి. తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం, దగ్గులాంటివి వస్తూనే ఉన్నాయి. కొంత‌మందిలో ఇవి దీర్ఘ‌కాలం ప్ర‌భావం చూపిస్తుండ‌గా మ‌రికొంద‌రిలో కొద్దివారాలుంటున్నాయి. కొవిడ్ బారిన ప‌డి కోలుకున్నారిలో 10శాతం మందికి ఏదో ఒక రూపంలో స‌మ‌స్య త‌లెత్తుతోంది. గుండె, ఊపిరితిత్తుల్లో స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుండ‌టంతోపాటు స్టెరాయిడ్స్ వాడిన‌వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయి గ‌ణ‌నీయంగా పెరుడుతున్న‌ట్లు వైద్య‌నిపుణ‌లు గుర్తించారు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డినా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఆరోగ్యాన్ని ప‌రిశీల‌న‌లో ఉంచుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ ల‌క్ష‌ణాలుంటే వైద్యుల‌ను సంప్ర‌దించండి
మాన‌సిక ఒత్తిడి తీవ్రంగా ఉండ‌టం, వ్య‌తిరేక ఆలోచ‌న‌లు చుట్టుముట్ట‌డం, ఆత్మహ‌త్య చేసుకోవాల‌నిపించ‌డం.. నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతుండ‌టం.. ర‌క్తంలో ఆక్సిజ‌న్ శాతం 92 శాతం కంటే త‌గ్గ‌డం.. చేతులు నీలిరంగులోకి మార‌డం.. న‌డిచిన‌ప్పుడు ఆయాసంగా ఉండ‌టం.. ద‌గ్గు తీవ్రంగా ఉండ‌టం.. జ్వ‌రం త‌రుచుగా 101 డిగ్రీలు దాటుతుండ‌టం.. ఛాతీలో ప‌ట్టేసిన‌ట్లుండ‌టం.. త‌ల‌నొప్పి, వాంతులు.. క‌ళ్ల వాపు, క‌నుగుడ్డు లాగ‌డం, క‌ళ్లు మ‌స‌క‌బార‌డం.. కాళ్ల‌వాపులు, నోటిపూత‌.. అయోమ‌య స్థితికి చేరుకోవ‌డంలాంటివ‌న్నీ ఏమాత్రం ఉన్నా త‌క్ష‌ణ‌మే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

దీర్ఘ‌కాలం వేధిస్తున్న స‌మ‌స్య‌లేంటంటే?
క‌ళ్లు తిరుగుతుండ‌టం.. చిన్న విష‌యాల‌కే కంగారు ప‌డుతుండ‌టం.. ఒళ్లు నొప్పులు, త‌ల‌నొప్పి.. జ్వ‌రం వ‌స్తుండ‌టం.. నీర‌సం.. అల‌స‌ట‌.. ఏకాగ్ర‌త త‌గ్గ‌డం.. ఆక‌లి త‌క్కువ‌గా ఉండ‌టం లాంటివ‌న్నీ దీర్ఘ‌కాలం ఉంటాయ‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.

శ‌రీరంలో నీరు త‌గినంత‌గా ఉండాలి!
శ‌రీరంలో నీటిశాతం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. నోరు తడారిపోతుండ‌టం.. మూత్రం మంట‌గా రావ‌డం లేదా చిక్క‌గా రావ‌డమ‌నేది వ‌రీరంలో నీటిశాతం త‌గ్గింద‌న‌డానికి సంకేతాలు. దాహం వేసిన‌ప్పుడ‌ల్లా నీరు త‌గ్గింద‌ని అర్థం చేసుకోవాలి. అందుకు త‌గ్గ‌ట్లుగా ద్ర‌వ‌ప‌దార్థాలు తీసుకుంటుండాలి.

శారీర‌క శ్ర‌మ త‌గ్గించాలి!
క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌కూడ‌దు. క‌నీసం ఈ విధానాన్ని 8 వారాల‌పాటు పాటించాలి. దీర్ఘ‌కాలికంగా ఉండే వ్యాధుల‌కు మందులు వాడుతున్న‌వారు వాటిని కొన‌సాగించుకోవ‌చ్చు. ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాల‌ని, అర్థ‌రాత్రి వ‌ర‌కు మేల్కొన‌కుండా, భ‌యాందోళ‌న‌లు క‌లిగించే దృశ్యాలు చూడ‌కుండా ఉండాల‌ని.. పుస్త‌కాలు చ‌దివేందుకు ప్రాధాన్య‌మివ్వాల‌ని.. ధూమ‌పానం, మ‌ద్యానికి దూరంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి భ‌యాందోళ‌న‌కు లోనుకాకూడ‌ద‌ని, జ్వ‌రం వ‌చ్చినా, ద‌గ్గువ‌చ్చినా క‌రోనా కాద‌నే విష‌యాన్ని గుర్తుంచుకొని పైన చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మూడు నెల‌ల కాలంలో పూర్తిగా కోలుకుంటార‌ని తెలియ‌జేస్తున్నారు.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>