LifeStyleN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/carona9ed2ab99-e835-416c-a2cc-b608f8f3f40e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/carona9ed2ab99-e835-416c-a2cc-b608f8f3f40e-415x250-IndiaHerald.jpgఖ‌మ్మం : క‌రోనా మ‌హామ్మారి అయ‌న వాళ్ల‌ని సైతం దూరం చేస్తుంది.క‌న్నత‌ల్లిదండ్రులు క‌రోనా బారిన ప‌డితే వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డానికి కూడా కొడుకులు మోహం చాటేస్తున్నారు.ఇలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో పెద్ద‌కొడుకులా ముందుకు వ‌చ్చి క‌రోనా బాధితుల‌ను ఆదుకుంటున్నాడు ఖ‌మ్మం జిల్లాకి చెందిన ఓ యువ‌కుడు.త‌న కారునే అంబులెన్స్‌గా మార్చి రోగుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నాడు.carona;suma;suma kanakala;district;telugu;smart phone;car;mla;hero;service;father;march;youthత‌న కారునే అంబులెన్స్‌గా మార్చిన యువ‌కుడుత‌న కారునే అంబులెన్స్‌గా మార్చిన యువ‌కుడుcarona;suma;suma kanakala;district;telugu;smart phone;car;mla;hero;service;father;march;youthSun, 16 May 2021 09:56:11 GMTఖ‌మ్మం : క‌రోనా మ‌హామ్మారి అయ‌న వాళ్ల‌ని సైతం దూరం చేస్తుంది.క‌న్నత‌ల్లిదండ్రులు క‌రోనా బారిన ప‌డితే వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డానికి కూడా కొడుకులు మోహం చాటేస్తున్నారు.ఇలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో పెద్ద‌కొడుకులా ముందుకు వ‌చ్చి క‌రోనా బాధితుల‌ను ఆదుకుంటున్నాడు ఖ‌మ్మం జిల్లాకి చెందిన ఓ యువ‌కుడు.త‌న కారునే అంబులెన్స్‌గా మార్చి రోగుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్లితే  కూసుమంచి మండ‌లం కేశ్వాపురంకి చెందిన న‌ల్ల‌మ‌ల రంజిత్ ఖ‌మ్మంలో నివాసం ఉంటూ హోట‌ల్ నిర్వ‌హిస్తున్నాడు. క‌రోనా మొద‌టి ద‌శ‌లో లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డిన పేద‌ల‌కు నిత్వ‌వ‌స‌ర వ‌స్తువులు అందించారు.వ‌ల‌స కూలీల‌ను సైతం ఆయ‌న ఆదుకున్నాడు. ఇప్పుడు రెండ‌వ ద‌శ‌లో క‌రోనా మ‌హామ్మారి క‌ల్లోలం సృష్టిస్తుంది. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా చాలా మంది సెకండ్ వేవ్‌లో క‌రోన బారిన‌ప‌డుతున్నారు.చాలామంది ఆసుప‌త్రుల‌కు వెళ్లేందుకు సైతం ర‌వాణ స‌దుపాయం లేక‌పోవ‌డంతో కొంత‌మంది ప్రాణాలు విడుస్తున్నారు.మ‌రికొంత మంది త‌మ సొంత‌వాళ్లే ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చికిత్స‌కు దూర‌మ‌వుతున్నారు.ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రంజిత్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుతున్నాడు. ఎప్పుడు ఏక్షణంలోనైనా త‌న‌కు ఫోన్ వ‌స్తే నిమిషాల్లో బాధితుల వ‌ద్ద‌కు చేరుతున్నాడు. అక్క‌డి నుంచి వారు వెళ్లాల్సిన ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లి వారిని అడ్మిట్ చేసి వ‌స్తున్నాడు. అర్థ‌రాత్రుల్లో కూడా క‌రోనా బాధితుల‌కు రంజిత్ సేవ‌లందిస్తున్నారు. కేవ‌లం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంమేగాక‌...మ‌ధిర‌,భ‌ద్రాచ‌లంకి కూడా త‌న కారులో బాధితుల‌ను త‌ర‌లిస్తున్నారు.వీళ్లు రిక‌వ‌రీ అయ్యాక మ‌ళ్లీ త‌న కారులోనే ఇంటి వ‌ద్ద దింపుతున్నారు.
అంతేకాకుండా వారికి నెలకు స‌రిప‌డా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు ఇచ్చి వారిని ఆదుకుంటున్నాడు.రంజిత్ ప్ర‌స్తుతం ఖ‌మ్మం జిల్లా తెలుగుయువ‌త  అధ్య‌క్షుడిగా ఉన్నారు. నంద‌మూరి ట్ర‌స్ట్ త‌రుపున అనేక సేవా కార్యాక్రమాలు చేస్తుండేవారు.క‌రోనా స‌మ‌యంలో కూడా పేద‌ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని త‌న‌వంతు సాయంగా ముందుకు వ‌చ్చి ఆదుకుంటున్నాడు. నంద‌మూరి ట్ర‌స్ట్ త‌రుపున రంజిత్  చేస్తున్న సేవ‌ల‌కుగాను హిందూపురం ఎమ్మెల్యే,హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఫోన్‌ చేసి రంజిత్‌ని అభినందించారు.ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన త‌న‌కు అన్ని వేళ‌లా అండ‌గా  ఉంటాన‌ని బాల‌కృష్ణ అభ‌య‌మిచ్చారు.త‌న ఇద్ద‌రి కుమార్తెల‌కు బ‌స‌వ‌తార‌కం,వసుంధ‌ర పేర్లు పెట్టుకున్న‌ట్లు రంజిత్ బాల‌య్య‌బాబుకి తెలప‌గా..ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు.చిన్న‌ప్ప‌టి నుంచి త‌న తండ్రి సేవ చేయ‌డం నేర్పించార‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా బాధితుల కోసం ఈ ఏడాది మొత్తం ఇలానే సేవా కార్య‌క్ర‌మాలు చేస్తాన‌ని రంజిత్ తెలిపారు.క‌రోన మ‌హామ్మారితో అయిన వాళ్లే కాద‌నుకుంటున్న ఈ స‌మ‌యంలో పెద్ద‌కొడుకుగా రంజిత్ ముందుకు వ‌చ్చి సేవ చేయ‌డాన్ని అంద‌రూ హ్యాట్సాఫ్ రంజిత్ అంటూ అభినందిస్తున్నారు.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీని టార్గెట్ చేస్తున్న మీడియా...? ఇక ఆయనను పక్కన పెట్టిందా...?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>