MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkee0ee038b8-c633-43f0-9b77-bcb5d9fe0aae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkee0ee038b8-c633-43f0-9b77-bcb5d9fe0aae-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ టాలీవుడ్ విలక్షణమైన నటుడు. ఆయన చాలా సినిమాలు చేశారు. ఎన్నో హిట్లు కూడా కొట్టారు. తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా వెంకీ సంపాదించుకున్నారు. సీనియర్లలో వెంకటేష్ కే ఎక్కువగా హిట్లు ఉన్నాయని చెప్పాలి. venkee;pawan;mahesh;venkatesh;balakrishna;kalyan;naga;prince;ram pothineni;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;naga aswin;venky mama;f2;blockbuster hit;hero;daggubati venkateswara rao;masala;racchaఆ మూవీస్ తో వెంకీ కొత్త రికార్డు.... ?ఆ మూవీస్ తో వెంకీ కొత్త రికార్డు.... ?venkee;pawan;mahesh;venkatesh;balakrishna;kalyan;naga;prince;ram pothineni;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;naga aswin;venky mama;f2;blockbuster hit;hero;daggubati venkateswara rao;masala;racchaSun, 16 May 2021 19:00:00 GMTవిక్టరీ వెంకటేష్ టాలీవుడ్ విలక్షణమైన నటుడు. ఆయన చాలా సినిమాలు చేశారు. ఎన్నో హిట్లు కూడా కొట్టారు. తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా వెంకీ సంపాదించుకున్నారు. సీనియర్లలో వెంకటేష్ కే ఎక్కువగా హిట్లు ఉన్నాయని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ తరం హీరోలలో ఎవరికీ లేని స్పెషాలిటీ వెంకటేష్ కి ఉంది. ఆయన నటించినన్ని మల్టీ స్టారర్ మూవీస్ మరే హీరో చేయలేదు అసలు మల్టీ స్టారర్ మూవీస్ అంటే స్క్రీన్ షేర్ మీద పెద్ద రచ్చ చెస్తారు. తమ పాత్రకు  ప్రాధాన్యత ఎలా ఉంటుందో అన్న లెక్కలు వేసుకుంటారు. ఆపోజిట్ ఎవరు ఉన్నారో కూడా చూసుకుని చివరికి నో చెప్పేస్తారు. మల్టీ స్టారర్ మూవీస్ టాలీవుడ్ లో రాకపోవడానికి కారణం ఇలాంటి లెక్కలే.

అందరు హీరోలూ మల్టీ స్టారర్ మూవీస్ చేస్తాం, మంచి కధ కావాలని తప్పించుకుంటారు. కానీ వెంకటేష్ మాత్రం మాట్లాడకుండా ఇప్పటికి అరడజన్ కి పైగా మల్టీ స్టారర్ మూవీస్ చేసేశారు. ఇంకా చేయడనికి కూడా రెడీ అంటున్నారు. ఆయన మహేష్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చేశారు. పవన్ కళ్యాణ్ తో గోపాలా గోపాలా మూవీ చేశారు. హీరో పోతినేని రామ్ తో కలసి మసాలా చేశారు. మేనల్లుడు నాగ చైతన్యతో కలసి వెంకీ మామ చేశారు. అదే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలసి నటించారు. ఇపుడు ఎఫ్ 3 లో కూడా మళ్లీ ఈ ఇద్దరూ నటిస్తున్నారు. ఇవే కాదు. దగ్గుబాటి రానాతో ఒక మల్టీ స్టారర్ కి వెంకీ ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా యంగ్ హీరోస్ ఎవరు ముందుకు వచ్చినా తాను నటించేందుకు రెడీ అంటున్నారు.

అప్పట్లో సూపర్ స్టార్ క్రిష్ణ ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే ఇపుడు వెంకీ ఆ లోటుని భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ సరే కానీ నాగ్, బాలయ్య, చిరు వీరంతా కలసి మల్టీ స్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. మరి అది జరుగుతుందా. చూడాలి.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదటిసారి తన సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న శివ కార్తికేయన్...

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>