PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modib1cecbe7-92da-46a0-904d-529ac5b26e2b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modib1cecbe7-92da-46a0-904d-529ac5b26e2b-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మ‌రోవైపు దేశంలో ఆక్సీజ‌న్ , క‌రోనా ఔష‌దాల కొర‌త ఆందోళన కలిగిస్తోంది. అయితే క‌రోనా క‌ట్ట‌డిలో మోడీ ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు క‌రోనా కేసులు పెరుగుతుంటే ఎప్రిల్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌ లోని అసన్‌సోల్‌లో ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు రmodi;modi;rohini;delhi;narendra modi;police;capital;prime minister;central government;dwaraka;narendraవ్యాక్సిన్ అడిగితే కేసులా...ఇదెక్క‌డి న్యాయం మోడీజీ.. ?వ్యాక్సిన్ అడిగితే కేసులా...ఇదెక్క‌డి న్యాయం మోడీజీ.. ?modi;modi;rohini;delhi;narendra modi;police;capital;prime minister;central government;dwaraka;narendraSun, 16 May 2021 09:25:28 GMTదేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మ‌రోవైపు దేశంలో ఆక్సీజ‌న్ , క‌రోనా ఔష‌దాల కొర‌త ఆందోళన కలిగిస్తోంది. అయితే క‌రోనా క‌ట్ట‌డిలో మోడీ ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు క‌రోనా కేసులు పెరుగుతుంటే ఎప్రిల్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌ లోని అసన్‌సోల్‌లో ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు రావ‌డాన్ని ఆయ‌న అభినందించారు. దాంతో మోడీ తీరుపై తీవ్ర‌విమ‌ర్ష‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా వ్యాక్సిన్ ల విష‌యంలోనూ కేంద్రం నిర్ల‌క్ష్యం చూపింది. మ‌న దేశ ప్ర‌జ‌ల‌కే వ్యాక్సిన్ లు వేయ‌కుండా ప‌క్క దేశాల‌కు మోడీ వ్యాక్సిన్ లు స‌ప్లై చేయ‌డం ఏంటని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా వ్యాక్సిన్ ల వ్య‌వ‌హారంపై డిల్లీలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. మోడీకి వ్య‌తిరేఖంగా డిల్లీ వీధుల్లో పోస్టర్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. 

మన పిల్లలకు వేయాల్సిన వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు? మోదీ గారు అని ప్రశ్నిస్తూ దేశ రాజధాని వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. పోస్ట‌ర్ల వ్య‌వ‌హారం అధికారుల‌కు చేర‌డంతో వెంట‌నే రంగంలోకి దిగారు. పోలీసులు పోస్ట‌ర్లు అంటించిన వారిని గుర్తుప‌ట్టే పనిలో ఉన్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే 15 మందిని అదుపులోకి తీసుకుని వారిపై 17 కేసులు న‌మోదుచేశారు. ఢిల్లీలోని రోహిణి, ఈశాన్య ఢిల్లీ, ఔటర్ ఢిల్లీ, ద్వారక, పశ్చిమ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ పరిధిలో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలపై అవిధేయత చూపినందుకు గానూ సెక్షన్ 188 కింద కేసులు న‌మోదుచేశారు. అయితే దేశంలో ఇలాంటి దారుణ‌మైన‌ ప‌రిస్థితులు రావ‌డానికి కార‌ణం ఎవ‌ర‌ని డిల్లీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. వ్యాక్సిన్ లు అడిగితే కేసులు పెట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>