PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb2387bbe-858b-43db-b78e-ecd144fb8cca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb2387bbe-858b-43db-b78e-ecd144fb8cca-415x250-IndiaHerald.jpgకరోనా.. ఇది ఒకరి నుంచి మరొకరికి వచ్చే వ్యాధి. రోగి తుమ్మడం, దగ్గడం వల్ల.. అతని నుంచి చుట్టుపక్కల వారికి వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల జనాభా ఎక్కువగా ఉంటే పట్నాలు, నగరాల్లో దీని ప్రభావం మొదట్లో చాలా ఎక్కువగా ఉండేది. మొదట్లో నమోదైన కరోనా కేసుల్లో 80 శాతం వరకూ పట్నాలు, నగరాల నుంచే ఉండేవి. అందుకే కరోనా వచ్చిన మొదట్లో సేఫ్టీ కోసమంటూ జనం పల్లెలకు వెళ్లేవారు. పట్నాల్లో ఉద్యోగాలు చేసే వారు తమ పిల్లలను పల్లెల్లో వదిలే వారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పట్నాలను మించి ఇప్పుడు పల్లెల్లో కరోనాcoronavirus;survey;population;panjaaపల్లెలపై కరోనా పంజా.. ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్..?పల్లెలపై కరోనా పంజా.. ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్..?coronavirus;survey;population;panjaaSun, 16 May 2021 10:00:00 GMTకరోనా.. ఇది ఒకరి నుంచి మరొకరికి వచ్చే వ్యాధి. రోగి తుమ్మడం, దగ్గడం వల్ల.. అతని నుంచి చుట్టుపక్కల వారికి వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల జనాభా ఎక్కువగా ఉంటే పట్నాలు, నగరాల్లో దీని ప్రభావం మొదట్లో చాలా ఎక్కువగా ఉండేది. మొదట్లో నమోదైన కరోనా కేసుల్లో 80 శాతం వరకూ పట్నాలు, నగరాల నుంచే ఉండేవి. అందుకే కరోనా వచ్చిన మొదట్లో సేఫ్టీ కోసమంటూ జనం పల్లెలకు వెళ్లేవారు. పట్నాల్లో ఉద్యోగాలు చేసే వారు తమ పిల్లలను పల్లెల్లో వదిలే వారు.

కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పట్నాలను మించి ఇప్పుడు పల్లెల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన వారం రోజుల్లో పట్టణాల కంటే అధికంగా నమోదయ్యాయి. ఏపీలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేతో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు చేస్తున్నారు. మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ గణాంకాలను తీసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది.

ఈ లెక్కలు చూస్తే.. కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరముందని తెలుస్తోంది. కొంతలో కొంత నయం ఏంటంటే.. పల్లెల్లో కరోనా మరణాల శాతం మాత్రం ఇంకా తక్కువగానే ఉంది. ఇప్పటికీ పట్టణాల్లోనే ఎక్కువగా మరణాలు ఉన్నాయి. అంతే కాదు.. రికవరీ శాతం కూడా పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉన్నట్టు ఫీవర్ సర్వేలో వెల్లడైంది.

కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో మే 7 నుంచి 14వ తేదీ నాటికి 355 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 4,792 క్లస్టర్లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో  ముందస్తుగా  బాధితులను గుర్తిస్తారు. వారిని ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఇందుకు సర్వేతో వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫీవర్‌ సర్వే కోసం 19 వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఏదేమైనా ఈ లెక్కలు చూస్తే కరోనా విషయంలో పల్లె వాసులు ఇంకాస్త జాగ్రత్తగా ఉండకతప్పదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీని టార్గెట్ చేస్తున్న మీడియా...? ఇక ఆయనను పక్కన పెట్టిందా...?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>