MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/celebrities-earnings020d8331-fd08-4db1-9bc6-8eeb57eea5a5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/celebrities-earnings020d8331-fd08-4db1-9bc6-8eeb57eea5a5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సినీ పరిశ్రమ కేవలం కొన్ని ముఖ్యమైన కుటుంబాల ఆధీనంలోనే ఉందని సినిమా వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉంటాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియకపోయినా దానిని కొంత వరకు వాస్తవం అని చెప్పే నెపోటిజంపై ఎంత రగడ జరిగిందో మీకు తెలిసిందే. ఈ నెపోటిజం అనే సమస్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మొదలయింది. ఈ తరహాలోనే ఎంతోమంది టాలెంటు ఉన్నా ఎదగలేకపోతున్నారనే అపవాదు ఉంది.CELEBRITIES-EARNINGS;koti;mahesh;alia bhatt;mahesh bhatt;sushant singh;bhama;raj;sushanth;tara;mercedes-benz;audi;land rover;england;bollywood;industries;cinema;london;producer;film industry;producer1;letter;heroine;houseఅలియా భట్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?అలియా భట్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?CELEBRITIES-EARNINGS;koti;mahesh;alia bhatt;mahesh bhatt;sushant singh;bhama;raj;sushanth;tara;mercedes-benz;audi;land rover;england;bollywood;industries;cinema;london;producer;film industry;producer1;letter;heroine;houseSun, 16 May 2021 13:00:00 GMTబాలీవుడ్ సినీ పరిశ్రమ కేవలం కొన్ని ముఖ్యమైన కుటుంబాల ఆధీనంలోనే ఉందని సినిమా వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉంటాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియకపోయినా దానిని కొంత వరకు వాస్తవం అని చెప్పే నెపోటిజంపై ఎంత రగడ జరిగిందో మీకు తెలిసిందే. ఈ నెపోటిజం అనే సమస్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మొదలయింది. ఈ తరహాలోనే ఎంతోమంది టాలెంటు ఉన్నా ఎదగలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఇలా బాలీవుడ్ ని శాసిస్తున్న వారిలో ఒకరే ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్. ఈయన కూతురే ప్రముఖ హీరోయిన్ అలియా భట్. చాలా మంది పిల్లలు పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ బాలీవుడ్ భామ అతి తక్కువ వయసులోనే కేవలం తన కష్టంతో కొన్ని ఆస్తులను సంపాదించుకుంది. ఈమె ఆస్తులను చూస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు. 

అలియా భట్ కు ఇంగ్లాండ్ లోని లండన్ నగరంలో అల్ట్రా రిచ్ డ్రీమ్ హోమ్ ఉందట...ఈమె ఈ నివాసాన్ని ఎంతో ఇష్టపడి తీసుకుందని ఒక లైవ్ కాల్ లో తెలిపింది. దీని విలువ 16 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మరియు ముంబైలోని జుహు ప్రాంతంలో మరో ఖరీదైన అపార్ట్ మెంట్ ఉందని తెలుస్తోంది. దీని విలువ 13.11 కోట్ల రూపాయలు. ఇవి మాత్రమే కాకుండా ఈమెకు కార్ల కలెక్షన్ అంటే ఎంతో ఇష్టం. ఈమెకు ఎంతో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఉంది. దీని ధర 2 కోట్లకు పైనే ఉంటుంది. అలాగే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ధర అక్షరాలా 1.88 కోట్ల రూపాయలు మరియు బి ఎమ్ డబ్ల్యు 7-సిరీస్ విలువ అక్షరాలా 1.37 కోట్ల రూపాయలు. జాగ్వర్ కూడా ఒకటుంది. దీని   విలువ 1 కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. ఆడి కారు 60 లక్షల పైనే ఉంటుంది. 

ఇంత ఖరీదైన కార్లలో లండన్ వీధులలో ఈమెకు షికారుకు వెళ్లడం అలవాటు. మనకు తెలియని ఇంకా ఎన్నో ఆస్తులు ఈమెకు ఉండి ఉండవచ్చు. ఇవి కాకుండా నటనకు వచ్చే పారితోషికాలు, మోడలింగ్ చేయగా వచ్చే పారితోషికాలు అదనం. ఈమె కొన్ని ప్రొడక్ట్స్ కు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. ఇలా ఇవి అన్నీ కలుపుకుంటే 2021 సంవత్సరం వరకు అలియా భట్ సంపాదన 159 కోట్లుగా ఉంది. గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. లేదంటే తన ఆస్తుల విలువ ఇంకా పెరిగి ఉండేది. ఏది ఏమైనా పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో...అతి చిన్న వయసులోనే ఇన్ని కోట్లకు అధిపతిగా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>