PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona1f9fb77d-1822-4f94-80f0-6024916b5cbe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona1f9fb77d-1822-4f94-80f0-6024916b5cbe-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతోంది. దీంతోపాటు మెదడు, నాడీ వ్యవస్థపైనా పడుతోందని న్యూరాలజీ వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరిన రోగుల్లో 30 శాతం వరకు, ఐసీయూలో ఆక్సిజన్ సేవలు పొందుతున్నవారిలో 40 శాతం, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నవారిలో 80 శాతం మందిలో నాడీవ్యవస్థ ప్రభావం కనపడుతోంది. వైరస్ తీవ్రతను బట్టి ఆయా అవయవాల పనితీరు దెబ్బతింటోందని, కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందినవారిలో సుమారు ఐదుశాతం మంది బాధితులు ఏదో ఒక న్యూరాలజీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని సంబంధిత వైద్యనిపుణcorona;mandula;heart;oxygen;insulin;chris lynn;coronavirusమెదడుపై కరోనా ప్రభావం?మెదడుపై కరోనా ప్రభావం?corona;mandula;heart;oxygen;insulin;chris lynn;coronavirusSun, 16 May 2021 12:25:18 GMTకరోనా వైరస్ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతోంది. దీంతోపాటు మెదడు, నాడీ వ్యవస్థపైనా పడుతోందని న్యూరాలజీ వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరిన రోగుల్లో 30 శాతం వరకు, ఐసీయూలో ఆక్సిజన్ సేవలు పొందుతున్నవారిలో 40 శాతం, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారిలో 80 శాతం మందిలో నాడీవ్యవస్థ ప్రభావం కనపడుతోంది. వైరస్ తీవ్రతను బట్టి ఆయా అవయవాల పనితీరు దెబ్బతింటోందని, కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందినవారిలో సుమారు ఐదుశాతం మంది బాధితులు ఏదో ఒక న్యూరాలజీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని సంబంధిత వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.

రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతోంది!
వైర‌స్ ప్ర‌భావానికి గురైన‌వారిలో కొంద‌రిపై మెదడువాపు వంటి ప్రమాదకరమైన జబ్బులు దాడిచేస్తున్నాయి. మెదడు రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి మరికొందరు పక్షవాతానికి గురవుతున్నారు. కోలుకున్న తర్వాత కూడా చురుకుదనం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బంధువులను గుర్తించలేకపోవడం,  వాళ్ల లోకంలో వారుండటం, కాలూచేయి సరిగా కదలకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటికి చేరిన తర్వాత ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు పొందాలని న్యూరాలజీ వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ‌రోజులు ఆసుప‌త్రిలో ఉండి స్టెరాయిడ్స్ పై ఆధార‌ప‌డ్డ‌వారిలో ఈ త‌ర‌హా స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని తెలియ‌జేస్తున్నారు. స్టెరాయిడ్స్ వాడుతున్న తొలిరోజునుంచే మ‌ధుమేహ బాధితుల్లో చ‌క్కెర స్థాయులు పెరుగుతుండ‌టంతో దీర్ఘ‌కాలికంగా తీసుకుంటున్న ఔష‌ధాల‌ను ఆపేసి ఇన్సులిన్ తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

గుండె కండరాల్లో వాపు?
కొవిడ్ బారిన పడినప్పుడు గుండె రక్తనాళాలపై వైరస్ ప్రభావం కనపడుతోంది. ముఖ్యంగా గుండె కండరాల్లో వాపు ఏర్పడటం, రక్తనాళాల్లో పూడిక ఏర్పడి హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే కొవిడ్ బాధితుల్లో రక్తం చిక్కబడకుండా మందులు వాడుతుంటారు. కోలుకొని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ మందులు వాడాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. రక్తపరీక్షల్లో డీడైమ‌ర్ ఎక్కువ‌గా ఉంటే క‌నీసం ఆరువారాల‌పాటు ర‌క్తం చిక్క‌బ‌డ‌కుండా ఔష‌ధాల‌ను తీసుకోవాల‌ని గుండె సంబంధిత వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. మ‌ధుమేహం, అధిక ర‌క్త‌పోటు, థైరాయిడ్ లాంటి దీర్ఘ‌కాలిక జ‌బ్బుల‌కు ఔష‌ధాల‌ను వాడుతున్న‌వారు య‌థావిధిగా వాటిని కొన‌సాగించాల‌ని చెబుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>