MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ram-short-film-eanto-telusaa9eba79b-0124-4306-ad2d-9db88fc0dd6b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ram-short-film-eanto-telusaa9eba79b-0124-4306-ad2d-9db88fc0dd6b-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు చాలా మంది నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంతవరకు ఎక్కడో ఒక చోట పని చేసి, తమకంటూ కొంత గుర్తింపును తెచ్చుకొని వుంటారు. అలాంటి వారిలో హీరో రామ్ కూడా ఒకరు. హీరో రామ్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందే తమిళంలో "అడయాళం" అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించారట. ఈ షార్ట్ ఫిలిం 2002 లో విడుదలైంది. ఇక ఈ షార్ట్ ఫిలిం ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రామ్.. ఇక ఇందులో నటించిన తీరుకు దర్శకులు కూడా ఫిదా అయ్యారు. అలా మొదటి సారి వైవీయస్ చౌదరి దర్HERO RAM FIRST SHORT FILEM;kumaar;choudary actor;ram pothineni;shankar;sukumar;cinema;media;tamil;ismart shankar;nenu sailaja;hero;success;march;ileana d'cruz;mass;fidaaహీరో రామ్ నటించిన షార్ట్ ఫిలిం ఏంటో తెలుసా ?హీరో రామ్ నటించిన షార్ట్ ఫిలిం ఏంటో తెలుసా ?HERO RAM FIRST SHORT FILEM;kumaar;choudary actor;ram pothineni;shankar;sukumar;cinema;media;tamil;ismart shankar;nenu sailaja;hero;success;march;ileana d'cruz;mass;fidaaSun, 16 May 2021 17:00:00 GMT
సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు చాలా మంది నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంతవరకు ఎక్కడో ఒక చోట పని చేసి, తమకంటూ  కొంత గుర్తింపును తెచ్చుకొని వుంటారు. అలాంటి వారిలో హీరో రామ్ కూడా ఒకరు. హీరో రామ్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందే తమిళంలో "అడయాళం" అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించారట. ఈ షార్ట్ ఫిలిం 2002 లో విడుదలైంది. ఇక ఈ షార్ట్ ఫిలిం ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రామ్.. ఇక ఇందులో నటించిన తీరుకు దర్శకులు కూడా ఫిదా అయ్యారు. అలా మొదటి సారి వైవీయస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు.


మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు రామ్ పోతినేని. అంతేకాకుండా  రామ్ కి  ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. ఇక ఈ సినిమా ద్వారా ఇలియానా కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆ తరువాత సినిమాలలోని కథలను ఎంచుకోవడంలో కొద్దిగా తడబడ్డాడు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం తన రెండవ చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం 2007 మార్చి 16వ తేదీన విడుదలైంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా  మిగిలినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


ఆ తరువాత సినిమా కథలను ఆచితూచి ఎంచుకోవడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే రెడీ, మస్కా వంటి సినిమాలలో నటించి,ఈ రెండు సినిమాల ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక 2016 లో విడుదలైన నేను శైలజ సినిమా ద్వారా రామ్ మరో బ్లాక్ బాస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నేను శైలజ సినిమా తర్వాత రామ్ నటించిన మరికొన్ని సినిమాలు  ఫ్లాప్ కాగా, ఇటీవల మాస్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు రామ్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?

ఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>