Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salaare14d105e-0e98-4fe7-b5c9-5ee24edb05c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salaare14d105e-0e98-4fe7-b5c9-5ee24edb05c5-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్‌ కాస్తా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా అంటే భారీ బడ్జెట్‌తో పాటు భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా ముగించుకున్నాడనుకున్నాం, కానీ ఈ సినిమాలో కాస్త షూటింగ్ పెండింగ్..salaar;prabhas;shruti;shruti haasan;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;india;bollywood;cinema;bahubali;naga aswin;international;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;chitramఈ రెండు కాదు.. అదే మొదలు.. ప్రభాస్ కొత్త ప్లాన్ఈ రెండు కాదు.. అదే మొదలు.. ప్రభాస్ కొత్త ప్లాన్salaar;prabhas;shruti;shruti haasan;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;india;bollywood;cinema;bahubali;naga aswin;international;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;chitramSun, 16 May 2021 22:01:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్‌ కాస్తా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా అంటే భారీ బడ్జెట్‌తో పాటు భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా ముగించుకున్నాడనుకున్నాం, కానీ ఈ సినిమాలో కాస్త షూటింగ్ పెండింగ్ ఉందని ఇటీవల వార్తలొచ్చాయి.

అయితే రాధేశ్యామ్ కాకుండా ప్రభాస్ మరో రెండు సినిమాల్లో ఏకకాలంలో నటిస్తున్నాడు. వాటిలో జాతీయ స్థాయి దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ సినిమా రూపొందిస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకొణే ప్రభాస్ సరసన నటించనుంది. ప్రభాస్ చేస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల చిత్రీకరణలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ముంబైలో పరిస్థితుల కారణంగా ఆదిపురుష్ చిత్రీకరణ ఆగింది. దాంతో ప్రభాస్ సలార్ పూర్తి చేసిన తరువాత రాధేశ్యామ్ షూటింగ్‌లో పాల్తొననున్నాడు. అంటే ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడం లేదు. సలార్ పూర్తయిన తర్వాత రాధేశ్యామ్ కంప్లీట్ చేయనున్నాడు.

ఇంతలో కరోనా తగ్గుముఖం పడితే ఆదిపురుష్‌ కూడా తిరిగా పట్టాలెక్కుతుంది. అయితే ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. ఆ పోస్టర్‌లో ఉన్న లుక్‌లోనే ప్రస్తుతం ప్రభాస్ షూట్ చేయనున్నాడట. ఫుల్ రగ్‌డ్ లుక్స్‌లో ప్రభాస్ భారీ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి భారీ అప్‌డేట్ రానుందని టాక్ నడుస్తోంది. మరి అప్‌డేట్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందులో ఆయన గొప్పయితే  - ఇందులో ఈయన గొప్ప .... అసలు తేడా అదేనప్ప .... ?? (శంకర్, రాజమౌళి)

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>