MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/paagal-to-release-in-ott-0efda509-47d7-464e-8e31-35ecc2332820-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/paagal-to-release-in-ott-0efda509-47d7-464e-8e31-35ecc2332820-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2017 లో వచ్చిన ‘వెళ్లిపోమాకే’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. విశ్వక్ తన తొలి సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ వెంటనే 2019లో ‘ఫలక్‌నామ..paagal;naresh;simran bagga;allari naresh;raj;venu;tollywood;cinema;amazon;hero;romantic;viswak sen;mass;venu thottempudiఓటీటీలోకి మరో యంగ్ హీరో..?ఓటీటీలోకి మరో యంగ్ హీరో..?paagal;naresh;simran bagga;allari naresh;raj;venu;tollywood;cinema;amazon;hero;romantic;viswak sen;mass;venu thottempudiSun, 16 May 2021 13:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2017 లో వచ్చిన ‘వెళ్లిపోమాకే’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. విశ్వక్ తన తొలి సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ వెంటనే 2019లో ‘ఫలక్‌నామ దాస్’ సినిమాతో మెయిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రేక్షకులతో మాస్ క దాస్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకి దర్శకుడిగానే కాకుండా సహనిర్మాత కూడా వ్యవహరించాడు.


 2020లో ‘హిట్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో పాగల్ కూడా ఒకటి.  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఓ ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.


సినిమా విడుదల విషయంలో మేకర్స్ చర్చలు చేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలీదని, ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారంట. ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, ఆహాలతో కూడా మంతనాలు చేసినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


ఇదిలా ఉంటే  ఈసినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా సిమ్రాన్ చౌదరీ కూడా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స బ్యానర్‌పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమారొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాస్ క దాస్ విశ్వక్ తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>