PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-babu-jagan-lokesh-latest-news-10th-class-examsc5b37ca1-27e7-4431-b695-aeb082ce2eff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-babu-jagan-lokesh-latest-news-10th-class-examsc5b37ca1-27e7-4431-b695-aeb082ce2eff-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలంతా భావిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదోతరగతి పరీక్షలను నిర్వహించి తీరుతామంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కొవిడ్ ఉధృతంగా వ్యాపిస్తున్న త‌రుణంలోను, ఏపీలో పాజిటివిటీ రేటు ఎక్కువ‌గా ఉన్న సంద‌ర్భంలో ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దేశవ్యాప్తycp, tdp, babu, jagan, lokesh, latest news, 10th class exams;lokesh;suresh;telugu desam party;audimulapu suresh;nara lokesh;andhra pradesh;telugu;chief minister;minister;central government;lokesh kanagaraj;partyవిద్యార్థుల జీవితాల‌తో పదోతరగతి రాజ‌కీయాలు?విద్యార్థుల జీవితాల‌తో పదోతరగతి రాజ‌కీయాలు?ycp, tdp, babu, jagan, lokesh, latest news, 10th class exams;lokesh;suresh;telugu desam party;audimulapu suresh;nara lokesh;andhra pradesh;telugu;chief minister;minister;central government;lokesh kanagaraj;partySun, 16 May 2021 15:00:25 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలంతా భావిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదోతరగతి పరీక్షలను నిర్వహించి తీరుతామంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కొవిడ్ ఉధృతంగా వ్యాపిస్తున్న త‌రుణంలోను, ఏపీలో పాజిటివిటీ రేటు ఎక్కువ‌గా ఉన్న సంద‌ర్భంలో ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోను ప‌దోత‌ర‌గ‌తి పరీక్షలు నిర్వహించే అవకాశం కనపడటంలేదు. కేంద్ర ప్రభుత్వమే సీబీఎస్ ఈ పరీక్షలను రద్దుచేసింది.. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా పరీక్షలు రద్దుచేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణుల‌ను చేస్తున్నారు. అటువంటిది మ‌న రాష్ట్రంలో అంత ప‌ట్టుద‌ల‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

జ‌గ‌న్‌, లోకేష్ ప‌రీక్ష‌లు రాయాలి!!

ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటే ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు, ఇత‌ర ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అంద‌రూ క‌లిసి దాదాపు 30 లక్ష‌ల మంది ఈ క్ర‌తువులో భాగ‌స్వాములు కావాల్సి ఉంటుంది. ఒక్క‌సారి ఊహించ‌డానికే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఇది. రాష్ట్రంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయాలంటూ నారా లోకేష్ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో వీడియో స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డం.. ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాయ‌డం.. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌చేత ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయించ‌డంలాంటి రాజ‌కీయ గిమ్మిక్కుల‌న్నీ చేశారు. సాధార‌ణంగా అయితే క‌రోనావ‌ల్ల రాష్ట్రంలో ప‌రిస్థితి బాగోలేదు.. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయండంటూ ప్ర‌భుత్వానికి ఒక లేఖ‌రాసి వ‌దిలేస్తే మాములుగానే ఉండేది. కానీ లోకేష్‌బాబు చాలా దుందుడుకు వైఖ‌రితో ప్ర‌భుత్వాన్ని రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ క్ష‌ణం వ‌ర‌కు కూడా ప‌రీక్ష‌ల గురించి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతూనే ఉన్నారు. క‌రోనా భ‌యంతో ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధంగా లేక‌పోవ‌డం.. ప‌రీక్ష‌లు రాయాల‌న్నా వెంటాడే క‌రోనా భ‌యం.. ఈ రెండు అంశాలు అంద‌రిలో ఆందోళ‌న క‌ల‌గ‌జేస్తున్నాయి.

రాజ‌కీయ క్రీడ‌?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వైఖ‌రి ఎలావుంటుందో తెలిసి కూడా రాజ‌కీయం చేసిన తెలుగుదేశంపార్టీని త‌ప్పుప‌ట్టాలా? ఎవ‌రెలా అనుకున్నా మ‌న‌కేంటి? మ‌న‌మెందుకు ప‌ట్టుద‌ల‌గా ఉండాలి? గ‌తేడాదిలాగానే ఈ ఏడాది కూడా విద్యార్థుల ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దుచేసి కొవిడ్‌వ్యాప్తిని అరిక‌డ‌దామ‌నే ఆలోచ‌న‌లేని ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టాలా? అర్థంకావ‌డంలేదంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు, విద్యావేత్త‌లు అంటున్నారు. ఇరువురు నేత‌లు రాజ‌కీయంగా ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు ఆడే రాజ‌కీయ క్రీడ‌ల్లో విద్యార్థుల‌ను బ‌లిప‌శువుల్ని చేయొద్ద‌ని ప్ర‌జ‌లంతా విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న సినిమా బండి

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>