MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood0601d91f-60ac-4b5f-a1c4-aae37f9ca71a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood0601d91f-60ac-4b5f-a1c4-aae37f9ca71a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చినా తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన విజయ్ ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో రౌడీ హీరో అనిపించుకున్నాడు. తన కెరీర్‌లో ద్వారక, డియర్ కామ్రాడ్ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా తన క్రేజ్‌ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఇటీవల విజయ్ చేసిన ‘వరల్డ్..Tollywood;beauty;mahesh;govinda;karan johar;kumaar;shiva;govi;kriti sanon;puri jagannadh;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;arjun reddy;marriage;director;lord siva;hero;heroine;joseph vijay;taxiwala;shiva nirvana;arjun 1;reddy;world famous lover;dwaraka;mass;devarakonda;loverరౌడీ హీరో సరసన మహేష్ హీరోయిన్.. ఆ సినిమా కోసమే..?రౌడీ హీరో సరసన మహేష్ హీరోయిన్.. ఆ సినిమా కోసమే..?Tollywood;beauty;mahesh;govinda;karan johar;kumaar;shiva;govi;kriti sanon;puri jagannadh;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;arjun reddy;marriage;director;lord siva;hero;heroine;joseph vijay;taxiwala;shiva nirvana;arjun 1;reddy;world famous lover;dwaraka;mass;devarakonda;loverSun, 16 May 2021 14:42:32 GMTటాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చినా తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన విజయ్ ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో రౌడీ హీరో అనిపించుకున్నాడు. తన కెరీర్‌లో ద్వారక, డియర్ కామ్రాడ్ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా తన క్రేజ్‌ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఇటీవల విజయ్ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. దాంతో మళ్లీ తనేంటో నిరూపించుకోవాలని విజయ్ కష్టపడుతున్నాడు.

ఇందులో భాగంగానే విజయ్ తన తాజా సినిమాను మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో జతకట్టాడు. వీరిద్దరి కాంబోలో పాన్ ఇండియా స్థాయి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి లైగర్ అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి చార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయి ఉంది. ఈ సినిమా చేస్తూనే విజయ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. లైగర్ తర్వాత విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేయనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా విజయ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ తన తదుపరి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడని, ఈ సినిమా పూర్తయ్యాక సుకుమార్‌తో సినిమా చేయనున్నాడట. అయితే కరోనా కారణంగా పుష్ప చిత్రీకరణ నిలిచిపోవడంతో సుకుమార్ తాను విజయ్‌తో చేయనున్న సినిమా స్క్రిప్ట్‌ను డవలప్ చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుందని టాక్ నడుస్తోంది. మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇప్పుడు మళ్లీ విజయ్ సినిమా కోసం మూవీ మేకర్స్ కృతిని సంప్రదించారని, అమ్మడు తన నిర్ణయం చెప్పాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరోసారి కేంద్రం కొవిడ్‌ మార్గదర్శకాలు విడుదల..!!

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>