MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-6377e49e-01c7-4348-ae69-0d7bacade068-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-6377e49e-01c7-4348-ae69-0d7bacade068-415x250-IndiaHerald.jpgశ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి పాత్రలను నటించి మెప్పించాలి అంటే చాల సాహసం చేయాలి. అలాంటి సాహసం చేసినా ప్రేక్షకుడు ఎంతవరకు అంగీకరిస్తారు అన్నవిషయం పై చివరివరకు టెన్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించడం ఒక సాహసం అయితే ఆ మూవీకి షూటింగ్ ప్రారంభోత్సవరోజు నుండి ఎదురౌతున్న కష్టాలు అనేక నెగిటివ్ సెంటిమెంట్ నుంచి దారి తీస్తున్నాయి.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ మూవీని ఒక దృశ్య కావ్యంగా తీయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయprabhas;;prabhas;ramu;hyderabad;bollywood;cinema;sri krishnaప్రభాస్ కు సహకరించని ఆదిపురుష్ !ప్రభాస్ కు సహకరించని ఆదిపురుష్ !prabhas;;prabhas;ramu;hyderabad;bollywood;cinema;sri krishnaSun, 16 May 2021 09:00:00 GMTADశ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి పాత్రలను నటించి మెప్పించాలి అంటే చాల సాహసం చేయాలి. అలాంటి సాహసం చేసినా ప్రేక్షకుడు ఎంతవరకు అంగీకరిస్తారు అన్నవిషయం పై చివరివరకు టెన్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించడం ఒక సాహసం అయితే ఆ మూవీకి షూటింగ్ ప్రారంభోత్సవరోజు నుండి ఎదురౌతున్న కష్టాలు అనేక నెగిటివ్ సెంటిమెంట్ నుంచి దారి తీస్తున్నాయి.


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ మూవీని ఒక దృశ్య కావ్యంగా తీయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఈమూవీ షూటింగ్ మొదటిరోజున అగ్నిప్రమాదం జరిగి కోట్లల్లో నష్టం వచ్చినా ఈ మూవీ షూటింగ్ ను బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించి ఇప్పటికే ముంబైలో 55 - 60 రోజుల పాటు షూటింగ్ జరిపారు.



ఆతరువాత ముంబాయిలో లాక్ డౌన్ ఏర్పడటంతో అది ఎప్పుడు తీసేస్తారో తెలియక ఈమూవీ షూటింగ్ ను హైదరాబాద్ లో కొనసాగించడానికి రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ వేసారు. మే 15 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ ప్రారంభించాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈమూవీలో నటిస్తున్న అందరు నటీనటులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుని అన్నీ రెడీ పెట్టారు.


అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణా లాక్ డౌన్ ఉండదు అని పదేపదే ప్రభుత్వ వర్గాలు గతంలో చెప్పడంతో ధైర్యంగా ఒక భారీ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో ఈమూవీ నిర్మాతలు రెడీ పెట్టారు. ఇప్పుడు లాక్ డౌన్ తెలంగాణాలో కూడ ప్రారంభం కావడంతో ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కపడతాయో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. పరిస్థితులు అన్నీ మరికొంత కాలం ఇలాగే కొనసాగితే ఈమూవీకి భారీ నిర్మాతలు వేసిన సెట్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీకి లక్షలలో అద్దె చెల్లించుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ‘ఆదిపురుష్’ ఎప్పుడు పూర్తి చేస్తారో ఈమూవీ నిర్మాతలకు కూడ తెలియని పరిస్థితి అంటున్నారు..

IPURUSH


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ఇంజెక్షన్‌తో బ్లాక్‌ ఫంగస్‌ మాయం.. రేటెంతో తెలుసా..?

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>