PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona491ad7bc-7e2e-4e2a-b1e5-134f5156a278-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona491ad7bc-7e2e-4e2a-b1e5-134f5156a278-415x250-IndiaHerald.jpgకుటుంబంలో అంద‌రికీ క‌రోనా సోకిన‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు ప‌నిమీద బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంటోంది. అలాంటివారిలో కొంద‌రు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌నీస‌ జాగ్ర‌త్త‌లు కూడా పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటువంటివారితోనే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. కొవిడ్ సోకిన త‌ర్వాత 14 రోజుల స్వీయ నిర్బంధం అనేది చాలా ముఖ్యం. కానీ ఎవ‌రూ ఈ నిబంధ‌న‌ పాటించ‌డంలేదు. దుకాణాల‌కు, కూర‌గాయ‌ల మార్కెట్లు, సూప‌ర్ బ‌జార్ల‌కు corona;andhra pradeshబ‌య‌ట‌కు రావొద్దు బాబూ.. మీకు దండం పెడ‌తాం!!బ‌య‌ట‌కు రావొద్దు బాబూ.. మీకు దండం పెడ‌తాం!!corona;andhra pradeshSun, 16 May 2021 10:54:31 GMT

కుటుంబంలో అంద‌రికీ క‌రోనా సోకిన‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు ప‌నిమీద బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంటోంది. అలాంటివారిలో కొంద‌రు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  క‌నీస‌ జాగ్ర‌త్త‌లు కూడా పాటించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటువంటివారితోనే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. కొవిడ్ సోకిన త‌ర్వాత 14 రోజుల స్వీయ నిర్బంధం అనేది చాలా ముఖ్యం. కానీ ఎవ‌రూ ఈ నిబంధ‌న‌ పాటించ‌డంలేదు. దుకాణాల‌కు,  కూర‌గాయ‌ల మార్కెట్లు, సూప‌ర్ బ‌జార్ల‌కు వెళుతూ య‌థేచ్ఛ‌గా సంచ‌రిస్తుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాజిటివిటీ రేటు పెరుగుతోందేకానీ త‌గ్గ‌డంలేదు. కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఏపీ రెండోస్థానానికి చేర‌డం ఆందోళ‌న‌క క‌లిగించే ప‌రిణామంగా మారింది.

ఎవ‌రికివారే బాధ్య‌త వ‌హించాలి!
కరోనా సోకిన వ్య‌క్తులు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి నుంచి ఇత‌రుల‌కు సోకే ముప్పు ఏర్ప‌డుతోందంటూ వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా పాటించ‌డంలేద‌ని.. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. అందుకే క‌రోనా సోక‌నివారు బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. కుటుంబానికి అవ‌స‌ర‌మైన వ‌స్తువుల్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఆన్ లైన్‌లో కొనుగోలు చేసేందుకు ప్రాధాన్య‌మివ్వాల‌ని, సొంత వాహ‌నాల‌ద్వారా ఆసుప‌త్రుల‌కు వెళ్లిరావాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. గుంపుల్లో క‌ల‌వ‌కుండా భౌతిక దూరం పాటించ‌డం.. మాస్క్‌లు ధ‌రించ‌డం క‌చ్చితంగా చేయాల‌ని కోరుతున్నారు.

చుట్టుప‌క్క‌ల‌వారి స‌హ‌కారం తీసుకోండి!
క‌రోనా సోకిన‌వారికి ఇప్పుడిప్పుడే చుట్టుప‌క్క‌ల‌వారి నుంచి స‌హ‌కారం అందే ధోర‌ణి క‌న‌ప‌డుతోంద‌ని.. ఇది క్ర‌మేణా పెరుగుతుంద‌ని.. కాబ‌ట్టి క‌రోనా సోకిన‌వారు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చుట్టుప‌క్క‌ల‌వారి స‌హ‌కారం తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. కొవిడ్ తొలిద‌శ‌లో కాంటాక్ట్స్ గుర్తించి వైద్య‌కేంద్రానికి త‌ర‌లించి తొలినాళ్ల‌లోనే గొలుసును తెగ్గొట్టేవారు. ఇప్పుడు ఆ ప్ర‌క్రియ అమ‌ల‌వ‌క‌పోవ‌డంతో వైర‌స్ ఎవ‌రికి సోకింద‌నే విష‌యం కూడా తెలియ‌డంలేదు. ల్యాబ్‌ల ద‌గ్గ‌ర‌, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌వ‌ద్ద‌, వ్యాక్సిన్ కేంద్రాల‌వ‌ద్ద ప్ర‌జ‌లు కిట‌కిట‌లాడుతున్నారు. వైర‌స్ బాధితులు సాధార‌ణ వ్య‌క్తులుగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. ప్ర‌తికొ్క‌రూ త‌మ త‌మ బాధ్య‌త‌ల‌ను గుర్తెరిగితే క‌రోనా నియంత్రించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీకాద‌ని సామాజిక‌వేత్త‌లు అంటున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి..!!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>