EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghurama-krishnam-raju9313b18f-87a8-4aff-b486-f4fe86ca2252-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghurama-krishnam-raju9313b18f-87a8-4aff-b486-f4fe86ca2252-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ప్రతి విషయానికి కులం, మతం ఆపాదించడం చూస్తూనే ఉన్నాం. ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు పెట్టి రాజకీయ లాభం పొందే నేతలు చాలామందే ఉన్నారు. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ విషయంలో కూడా కుల ప్రస్తావన వచ్చింది. క్షత్రియులపై వైసీపీ కక్షసాధిస్తోందని కొంతమంది బహిరంగ విమర్శలకు దిగారు. అందులోనూ సరిగ్గా పుట్టినరోజునాడే రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేయడం, విచారణలో ఆయన్ని కొట్టారంటూ ఆరోపణలు రావడంతో ప్రభుత్వంపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. raghurama krishnam raju;ashok;krishna;raghu;ramakrishna;satya;kshatriya;jagan;kanumuru raghu rama krishnam raju;y. s. rajasekhara reddy;mp;government;king;episode;arrest;ycp;kanumuru raghu rama krishna rajuక్షత్రియులపై కక్షసాధింపా..?క్షత్రియులపై కక్షసాధింపా..?raghurama krishnam raju;ashok;krishna;raghu;ramakrishna;satya;kshatriya;jagan;kanumuru raghu rama krishnam raju;y. s. rajasekhara reddy;mp;government;king;episode;arrest;ycp;kanumuru raghu rama krishna rajuSun, 16 May 2021 09:00:00 GMTరాజకీయాల్లో ప్రతి విషయానికి కులం, మతం ఆపాదించడం చూస్తూనే ఉన్నాం. ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు పెట్టి రాజకీయ లాభం పొందే నేతలు చాలామందే ఉన్నారు. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ విషయంలో కూడా కుల ప్రస్తావన వచ్చింది. క్షత్రియులపై వైసీపీ కక్షసాధిస్తోందని కొంతమంది బహిరంగ విమర్శలకు దిగారు. అందులోనూ సరిగ్గా పుట్టినరోజునాడే రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేయడం, విచారణలో ఆయన్ని కొట్టారంటూ ఆరోపణలు రావడంతో ప్రభుత్వంపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.

ఎంపిీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రాష్ట్ర క్ష‌త్రియ సంఘం అధ్య‌క్షులు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు అన్నారు. ఇది కక్ష సాధింపులో భాగ‌మేన‌ని ఆయన విమర్శించారు. సీఎం జగన్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ పిటిషన్ వేసినందుకే పగబట్టి కావాలని రఘురామను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.  వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారి గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు కూడా ఇదే విషయంపై తీవ్రంగా స్పందించారు. క్షత్రియులపై కక్షసాధింపు చర్యలు ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. గతంలో అశోక్ గజపతి రాజుపై అక్రమ కేసులు పెట్టారని, తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణంరాజుపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ఈనెల 17న విచారణకు వస్తుందని, ఆ కేసు వాదించకుండా న్యాయవాదులను బెదిరించేందుకే ఎంపీని అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

సడన్ గా ఈ ఎపిసోడ్ లోకి సత్యం రామలింగరాజు ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు కొంతమంది. వైఎస్సార్ హయాంలో సత్యం రామలింగరాజు అరెస్ట్ అయ్యారని, ఇప్పుడు జగన్ హయాంలో కూడా క్షత్రియుల అరెస్ట్ లు జరుగుతున్నాయనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

అరెస్ట్ ఎక్కడ చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు అనే విషయాలను పక్కనపెడితే.. రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో రఘురామకృష్ణంరాజుపై సీఐడీ కేసులు పెట్టింది. ఇది ఇప్పుడు కులం రంగు పులుముకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ఇంజెక్షన్‌తో బ్లాక్‌ ఫంగస్‌ మాయం.. రేటెంతో తెలుసా..?

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>