MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/celebrities-earningsc16312fa-c08b-4add-8c95-db3dcc266ebb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/celebrities-earningsc16312fa-c08b-4add-8c95-db3dcc266ebb-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఖాన్స్ త్రయం పూర్తి డామినేషన్ కనబరుస్తుంది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ ముగ్గురు కూడా సినిమాల రికార్డుల పరంగాను, కలెక్షన్ల పరంగాను బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు. బాలీవుడ్ లో ప్రదాన పోటీ ఈ ముగ్గురి మద్యే ఉంటుంది. ఇక సంపాదన పరంగా కూడా ఈ ముగ్గురి స్టార్స్ తమకు తామే పోటీ అన్నట్లుగా సంపాదిస్తుంటారు. అయితే ఈ ముగ్గురికి షాక్ ఇస్తూ సంపాదనలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ టాప్ గా కొనసాగుతున్నాడు. celebrities-earnings;aamir khan;akshay kumar;kumaar;salman khan;akshay;pruthvi;raj;ram pothineni;rakshabandhan;ameer khan;bollywood;cinema;cinema theater;google;2020;box office;letter;sooryavanshi;forbesఅక్షయ్ సంపాదనకు హడలిపోతున్న ఖాన్స్ త్రయం ..!అక్షయ్ సంపాదనకు హడలిపోతున్న ఖాన్స్ త్రయం ..!celebrities-earnings;aamir khan;akshay kumar;kumaar;salman khan;akshay;pruthvi;raj;ram pothineni;rakshabandhan;ameer khan;bollywood;cinema;cinema theater;google;2020;box office;letter;sooryavanshi;forbesSun, 16 May 2021 08:50:40 GMTబాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఖాన్స్ త్రయం పూర్తి డామినేషన్ కనబరుస్తుంది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ ముగ్గురు కూడా సినిమాల రికార్డుల పరంగాను, కలెక్షన్ల పరంగాను బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు. బాలీవుడ్ లో ప్రదాన పోటీ ఈ ముగ్గురి మద్యే ఉంటుంది. ఇక సంపాదన పరంగా కూడా ఈ ముగ్గురి స్టార్స్ తమకు తామే పోటీ అన్నట్లుగా సంపాదిస్తుంటారు. అయితే ఈ ముగ్గురికి షాక్ ఇస్తూ సంపాదనలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ టాప్ గా కొనసాగుతున్నాడు. 

ఏడాదికి కనీసం నాలుగు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద అలరించే అక్కి ఒక్కో సినిమాకు 120 కోట్లు తీసుకుంటూ ఏడాదిలో దాదాపుగా 400 కోట్ల దాకా సంపాదిస్తున్నాడు. ఇక కేవలం సినిమాల పరంగానే కాక ప్రకటనల ద్వారా కూడా అక్షయ్ భారీ మొత్తంలో అర్జీస్తున్నాడు. గత ఆరేళ్లకాలంలో అక్షయ్ సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. అమెరికన్ మేగజైన్ ఫోర్బ్స్ ప్రకారం గత ఆరేళ్లలో అక్షయ్ కుమార్ 17 వందల 44 కోట్లు సంపాదించాడు. 2020లో 356 కోట్లు కాగా, 2019లో 459 కోట్లు, 2018లో 40.5 కోట్లు, 2017లో 35.5 కోట్లు, 2016లో 32.5 కోట్లుగా అక్షయ్ కుమార్ సంపాదన ఉంది. ఇక కరోనా మహమ్మారి సమయంలో సైతం అతడి సంపాదన ఆగలేదు. 2020లో కరోనా కారణంగా చాలా మంది తారలు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంటికే పరిమితం కావడంతో తరాల సంపాదనకు గండి పడింది. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 2020 సంవత్సరానికి గాను 356 కోట్లు సంపాదించి, ప్రపంచ వ్యాప్తంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో అక్షయ్ 52వ స్థానంలో నిలవడం సామాన్య విషయం కాదు. ఇక తన సంపాదనలో చాలా వరకు పలు సేవాకార్యక్రమాలకు కేటాయిస్తుంటాడు అక్షయ్. ఇక ఈ బాలీవుడ్ ఖిలాడి గతేడాది కేవలం ఒకే ఒక్క సినిమా లక్ష్మీతో ఓ టీ టీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 7సినిమాలను లైన్లో పెట్టాడు. ఈసారి కేవలం ఓటీటీ ప్లాట్ ఫాంలలో మాత్రమే కాకుండా థియేటర్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అక్షయ్ ఖాతాలో బెల్ బాటం, సూర్యవంశీ, అత్రంగి రే, పృథ్వీ రాజ్, రక్షాబంధన్, రామ్ సేథు, బచ్చన్ పాండే తదితర సినిమాలు ఉన్నాయి. ..    .






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ ఆదిపురుష్ లో కీలక పాత్రలో బిగ్ బాస్ విన్నర్

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>