MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna306822b3-d11c-40b1-bd06-a6f4349ef37d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna306822b3-d11c-40b1-bd06-a6f4349ef37d-415x250-IndiaHerald.jpgకింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత వైల్డ్ డాగ్ సినిమాతో హిట్ కొట్టారు. రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కరోనా కాలంలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను ధియేటర్లో చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు టాtollywood gossips;nagarjuna akkineni;akhil akkineni;kalyan;kalyan krishna;krishna;praveen;praveen sattaru;goa;tollywood;cinema;king;king 1నాగ్ - ప్రవీణ్ సత్తారు సినిమాకి కొత్త చిక్కులు?నాగ్ - ప్రవీణ్ సత్తారు సినిమాకి కొత్త చిక్కులు?tollywood gossips;nagarjuna akkineni;akhil akkineni;kalyan;kalyan krishna;krishna;praveen;praveen sattaru;goa;tollywood;cinema;king;king 1Sun, 16 May 2021 11:00:00 GMTకింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత వైల్డ్ డాగ్ సినిమాతో హిట్ కొట్టారు. రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కరోనా కాలంలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను ధియేటర్లో చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. 

అదేమిటంటే ఇటీవలే షూటింగ్ ప్రారంభించి గోవా లో ఒక చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాని నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. ప్రవీణ్ సత్తారు నాగార్జున మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని నాగార్జున ప్రవీణ్ సత్తారుని కోరారట. కానీ చాలా మార్పులు చేర్పులు చేయడానికి ప్రవీణ్ సత్తారు ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది సినిమా యూనిట్ నుంచి ఏదైనా ప్రకటన వస్తే గానీ చెప్పలేము.

ఇక ప్రవీణ్ సత్తారు సినిమా ఆగిపోవడంతో ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా ఏదో అనేక కారణాల వల్ల లేట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగార్జున రంగంలోకి దిగి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.. కరోనా హడావిడి తగ్గాక బంగార్రాజు సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమాలో అఖిల్ నాగార్జునకు మనవడి పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'తౌటే' అంటే అర్థం ఇదే..!!

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>