MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/gopichand-seetimaar-movie-release-dateb08c1767-3b72-4274-a306-678727dbaa22-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/gopichand-seetimaar-movie-release-dateb08c1767-3b72-4274-a306-678727dbaa22-415x250-IndiaHerald.jpgసాధారణంగా అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ త‌ర్వాత విల‌న్ గా న‌టించేందుకు హీరోలు ఆస‌క్తి చూపించ‌రు. కానీ విల‌న్ గానూ న‌టించి మ‌ళ్లీ హీరోగా మెప్పించే న‌టులు చాలా త‌క్కువ మంది ఉంటారు. గోపీచంద్ కూడా అలాంటి న‌టుల్లో ఒక‌రు. గోపీచంద్ 2001లో తొలివ‌ల‌పు సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. అయితే తేజ డైరెక్ష‌న్ లో నితిన్ హీరోగా న‌టించిన జ‌యం సినిమాలో విల‌న్ గా అవ‌కాశం రావ‌డంతో న‌టించేందుకు ఒప్పుకున్నారు. అయితే జ‌యం సినిమాలో మొద‌టగా ఓ బాలీవుడ్ న‌టుడు విల‌న్ గా న‌టించార‌ట‌. కానీ కొన్నిరోజుల షూటింగ్ త‌రgopichand;nithin;gopichand;teja;bollywood;tollywood;cinema;hero;nithin reddyబాలీవుడ్ విలన్ స్థానంలో గోపీచంద్.. !బాలీవుడ్ విలన్ స్థానంలో గోపీచంద్.. !gopichand;nithin;gopichand;teja;bollywood;tollywood;cinema;hero;nithin reddySun, 16 May 2021 21:00:00 GMTసాధారణంగా అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ త‌ర్వాత విల‌న్ గా న‌టించేందుకు హీరోలు ఆస‌క్తి చూపించ‌రు. కానీ విల‌న్ గానూ న‌టించి మ‌ళ్లీ హీరోగా మెప్పించే న‌టులు చాలా త‌క్కువ మంది ఉంటారు. గోపీచంద్ కూడా అలాంటి న‌టుల్లో ఒక‌రు. గోపీచంద్ 2001లో తొలివ‌ల‌పు సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. అయితే తేజ డైరెక్ష‌న్ లో నితిన్ హీరోగా న‌టించిన జ‌యం సినిమాలో విల‌న్ గా అవ‌కాశం రావ‌డంతో న‌టించేందుకు ఒప్పుకున్నారు. అయితే జ‌యం సినిమాలో మొద‌టగా ఓ బాలీవుడ్ న‌టుడు విల‌న్ గా న‌టించార‌ట‌. కానీ కొన్నిరోజుల షూటింగ్ త‌ర‌వాత అత‌డి ప‌ర్ఫామెన్స్ తేజ‌కు అంత‌గా న‌చ్చ‌లేద‌ట‌. దాంతో తేజ అత‌డిని సినిమా నుండి తీసివేశార‌ట‌. ఈ నేప‌థ్యంలో తేజ అసిస్టెంట్ ఒక‌రు గోపిచంద్ ను స‌జెస్ట్ చేశారు. అలా తేజ‌కు ప‌రిచ‌య‌మైన గోపీచంద్ సినిమాలో విల‌న్ గా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దాంతో వెంట‌నే గోపీచంద్ కు హెయిర్ స్టైల్ చేయించి..పాత్ర‌కు స‌రిపోతావ‌ని చెప్పారు తేజ‌. అలా గోపీచంద్ విల‌న్ గా న‌టించ‌డం ప్రేక్ష‌కులనుండి ప్ర‌శంస‌లు అందుకోవడం జ‌రిగింది. 

అంతే కాకుండా ఈ సినిమా విజ‌యంలో గోపీచంద్ పాత్ర ఎంతో ఉంది. హీరో కంటే విల‌న్ పాత్రే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత కూడా గోపిచంద్ వ‌ర్షం, నిజం సినిమాల్లో విల‌న్ గా న‌టించారు. ఆత‌ర‌వాత మ‌ళ్లీ య‌జ్ఞం సినిమాతో గోపీచంద్ హీరోగా సూప‌ర్ హిట్ అందుకున్నారు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ మ్యాచో మ్యాన్ కెరీర్ లో వెన‌క్కు తిరిగి చూడ‌లేదు. వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం గోపీచంద్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మ‌ళ్లీ గోపీచంద్ విల‌న్ గా న‌టించేందుకు సిద్ద‌మ‌య్యారు అంటూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో వార్త‌లు వ‌చ్చినా ఒక్క‌టి కూడా నిజం అవ్వ‌లేదు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం గోపీచంద్ న‌టించిన సినిమా సీటీమార్ ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా కరోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాగానే సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషాదం: పెళ్లైన ఐదు రోజులకే వరుడు మృతి..!

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>