WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/amma-pregnant-women-should-stay-away-from-these-five-things6e7672a8-54e9-46de-94b3-4b7bacc1783e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/amma-pregnant-women-should-stay-away-from-these-five-things6e7672a8-54e9-46de-94b3-4b7bacc1783e-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉడాలి. గర్భిణులుగా ఉన్నప్పుడు జరిగే శారీరక, మానసిక మార్పులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయ్ . దీని వలన కలిగే పరిణామాలు తల్లితో పాటు శిశివుని కూడా బాధిస్తాయి. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమితనం, మలబద్దకం వంటి విషయాలు శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.Pregnant women;mandula;bacteria;dogsఅమ్మ: గర్భిణీలు ఈ ఐదు విషయాలకు దూరంగా ఉండాలి..!అమ్మ: గర్భిణీలు ఈ ఐదు విషయాలకు దూరంగా ఉండాలి..!Pregnant women;mandula;bacteria;dogsSun, 16 May 2021 15:00:00 GMTగర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉడాలి. గర్భిణులుగా ఉన్నప్పుడు జరిగే శారీరక, మానసిక మార్పులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయ్ . దీని వలన కలిగే పరిణామాలు తల్లితో పాటు శిశివుని కూడా బాధిస్తాయి. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమితనం, మలబద్దకం వంటి విషయాలు శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఏదైనా వ్యాపకం అలవాటు చేసుకోవడం మంచిది.

ఇక గర్భంతో ఉన్నపుడు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. పిల్లి, కుక్క, పక్షులు లేదా ఇతర జంతువులు అనేక రకమైన వైరస్,బాక్టీరియా లను కలిగివుంటాయి, వీటికి దగ్గరగా ఉన్న సమయములో అవి మనకు వ్యాపించే ప్రమాదం వుంది. అందు వలన కడుపుతో ఉన్న వారు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. \ధూమపానం వలన నికోటిన్ ,కార్బన్ మోనాక్సైడ్ ,లెడ్ లాంటి ప్రమాదకరమైన పదార్ధాలు మీతో పాటు శిశువు కూడా చేరుతాయి. దీనివలన గర్భస్రావం, నెలలు ముందే కాన్పు జరగడం,శిశు మరణాలు లాంటి తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవలసివస్తుంది. దూమపానాలకు దూరంగా ఉండండి.

గర్భిణులు దోమలు లేదా ఇతర ప్రమాదకరమైన పురుగుల నుంచి రక్షించుకోడానికి , ఇంట్లో జెట్ బిళ్ళలు లాంటి అనేక రకాల మందులు వాడడం సహజం.వీటివల్ల కలిగే మంచి ఎంతో చెడు కూడా అంతే వుంది. ఈ మందులు వాడే తీవ్రత పెరిగినప్పుడు వాటిలోని విష పదార్ధాలు శ్వాసలోకి చేరి నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపించి తల్లికి బిడ్డకు ప్రమాదంగా మారే అవకాశం వుంది.

ఇక వ్యాయామం ఆరోగ్యానికి మంచిదైనా కడుపుతో ఉన్నపుడు శరీరానికి అధిక శ్రమను కల్గినవి చేయకపోవడం మంచిది. డాక్టర్ల సలహా మేరకు ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిదో అవి మాత్రమే చేయండి. బరువులు ఎత్తడం, మోయడం లాంటి విషయాలకు ఎంత దూరంగా వుంటే అంత మంచిది.బరువులు ఎత్తడం వలన ఆ భారం గర్భంలోని శిశువు మీద పాడే అవకాశం వుంది చిన్నపాటి బరువు కల సరకుల సంచి అయినా సరే మీరు మోయకుండా వుండే వీలు చూసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాగల 24 గంటల్లో..మరింత డేంజర్..!!

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>