PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gvla5af4264-8a03-45c9-9ba8-52b92df08edb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gvla5af4264-8a03-45c9-9ba8-52b92df08edb-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని బిజెపి రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఆరోపించారు. కరోనా పై దృష్టి పెట్టకుండా ఏపీ ప్రభుత్వం రాజకీయ అంశాలపై దృష్టి పెడుతుంది అని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరం అని అన్నారు. వ్యక్తిగత కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం తగదు అని ఈ సందర్భంగా హితవు పలికారు. ఇందుకోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం దారుణం అన్నారు. రఘురామ కృష్ణ రాజుపై పెట్టిన కేసు నిలువదు అనgvl;krishna;raghu;bharatiya janata party;andhra pradesh;telangana;rajya sabha;mp;media;king;arrest;central governmentరఘురామ అరెస్ట్ పై బిజెపి రాజ్యసభ ఎంపీ రియాక్షన్రఘురామ అరెస్ట్ పై బిజెపి రాజ్యసభ ఎంపీ రియాక్షన్gvl;krishna;raghu;bharatiya janata party;andhra pradesh;telangana;rajya sabha;mp;media;king;arrest;central governmentSun, 16 May 2021 18:00:00 GMTకరోనా పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని బిజెపి రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఆరోపించారు. కరోనా పై దృష్టి పెట్టకుండా ఏపీ ప్రభుత్వం రాజకీయ అంశాలపై దృష్టి పెడుతుంది అని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు  పాల్పడటం బాధాకరం అని అన్నారు. వ్యక్తిగత కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం తగదు అని ఈ సందర్భంగా హితవు పలికారు. ఇందుకోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం దారుణం అన్నారు.

రఘురామ కృష్ణ రాజుపై పెట్టిన కేసు నిలువదు అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. వెంటనే  రఘురామ కృష్ణ రాజు పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి  అని డిమాండ్ చేసారు. మీడియా స్వేచ్ఛకు బిజెపి ఎప్పుడూ విఘాతం కలిగించలేదు అని అన్నారు. మీడియా కూడా నిష్పక్షపాతంగా పనిచేయడం లేదు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. అనేక మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు ప్రాపగండా చేస్తున్నాయి అని ఈ సందర్భంగా విమర్శలు చేసారు. అనేక మీడియా సంస్థలు బిజెపికి వ్యతిరేకంగా దురుద్ధేశపూరితంగా వ్యవహరించాయి అని అన్నారు.

అయినా సరే బిజెపి ఏనాడూ మీడియాపై ఇలాంటి ధోరణి ప్రదర్శించలేదు అని ఆయన మండిపడ్డారు. ఛానెళ్లపై కేసులు నమోదు చేయడం, లైసెన్సులు రద్దు చేయడం ఇంత వరకు జరగలేదు అని అన్నారు. ఛానెళ్లు చేసే దుష్ప్రచారాన్ని విమర్శలతోనే సమాధానం చెప్పాం తప్ప కేసులతో కాదు అని ఆయన సూచించారు. రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు మీడియాకు ఉన్న ప్రాథమిక హక్కు అని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చారనడం హాస్యాస్పదం అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణా సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపడం కూడా స్పందించారు. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను ఆపేయడం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా అని  అన్నారు. మానవతా కోణంలో తెలంగాణా ప్రభుత్వం ఏపీ పేషేంట్లను వైద్యం కోసం తెలంగాణ లోకి అనుమతించాలి అని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కి తప్పలేదు.. ఫ్రెండ్ కోసం మళ్ళీ ..!!

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>