CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/chiting5cff723e-e75a-4413-ba2b-c4cff2c6f576-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/chiting5cff723e-e75a-4413-ba2b-c4cff2c6f576-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. కొంతం మంది టెక్నాలజీని వాడుకొని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్నారు. ఇక రోజరోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం కేటుగాళ్లు రకరకాలుగా జనాల్ని దోచుకుంటున్నారు. మ్యాట్రిమోనీ పేరుతో ఇప్పటికే చాలామంది యువత మోసపోయారు. chiting;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;marriage;marchవైద్యుడిని.. పెళ్లి చేసుకుంటానంటూ.. మహిళకు టోకరా..!వైద్యుడిని.. పెళ్లి చేసుకుంటానంటూ.. మహిళకు టోకరా..!chiting;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;police;marriage;marchSun, 16 May 2021 13:00:00 GMTనేటి సమాజంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. కొంతం మంది టెక్నాలజీని వాడుకొని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్నారు. ఇక రోజరోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం కేటుగాళ్లు రకరకాలుగా జనాల్ని దోచుకుంటున్నారు. మ్యాట్రిమోనీ పేరుతో ఇప్పటికే చాలామంది యువత మోసపోయారు. తాజాగా మరో యువతి కూడా మాట్రిమోనీలో వచ్చిన రిక్వస్ట్ చూసి అడ్డంగా బుక్కైంది. ఏకంగా లక్షల రూపాయల్ని పోగొట్టుకుంది. పెళ్లి సంబంధం కోసం భారత్‌ మాట్రిమోనీలో తన వివరాలు రిజిస్టర్‌ చేసుకున్న మహిళను ట్రాప్‌ చేశాడు ఓ సైబర్‌ కేటుగాడు. ఆమె నుంచి లక్షలు కాజేశాడు.

ఇక సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎమ్‌ ప్రసాద్‌ వివరాల ప్రకారం ఈస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన ఓ యువతి వరుడి కోసం భారత్‌ మాట్రిమోని సంస్థలో వివరాలు నమోదు చేసుకుంది. ఇటీవల ఒక వ్యక్తి ఆమెకు కాల్‌ చేశాడు. తన పేరు బక్షి క్లిఫర్డ్‌ అని, పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వాడినని పరిచయం చేసుకున్నాడు. బిజినెస్‌ వ్యవహారాల వల్ల స్కాట్లాండ్‌ లో స్థిరపడ్డానని చెప్పాడు. 'మనం పెళ్లిచేసుకుందాం..' అని ప్రతిపాదన పెట్టాడు. అతని మాటలు నిజమేనని ఆమె నమ్మింది.

కాగా, పెళ్లి అంటే సరే అంటూ ఆమె కూడా ఓకే చెప్పింది. అయితే తమ ప్రేమకు గుర్తుగా ఒక ఖరీదైన గిఫ్టు పంపిస్తున్న అని ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారుల పేరుతో గొంతు మార్చి వేరే ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ చేశాడు. యువతి నుంచి మూడు దఫాలుగా మొత్తం రూ.తొమ్మిది లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి శనివారం ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. మ్యాట్రిమోనిలో పేరుతో జరుగుతున్న మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>