PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus06bd59f5-9f83-4ccd-ad67-05fbdec00ebe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus06bd59f5-9f83-4ccd-ad67-05fbdec00ebe-415x250-IndiaHerald.jpgకరోనా నుంచి దేశాన్ని కాపాడేది కేవలం వ్యాక్సిన్ మాత్రమే. వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నా.. ప్రాణాలు పోయేంత సీరియస్ కాదు. అయితే మరి ఈ దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. ఈ ప్రశ్నకు ఇప్పటి వరకూ సరైన సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉంది. భారత్ బయోటెక్, సీరం సంస్థల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 కోట్ల డోసులు కూడా లేదు. ఇలాంటి సమయంలో డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపాcoronavirus;modi;rahul new;rahul;k l rahul;india;rahul gandhi;mohandas karamchand gandhi;g kishan reddy;media;december;job;september;minister;rahul sipligunj;central government;june;reddyడిసెంబర్ వరకూ నో వ్యాక్సిన్.. చేదు నిజం బయటపెట్టిన కేంద్రమంత్రి..?డిసెంబర్ వరకూ నో వ్యాక్సిన్.. చేదు నిజం బయటపెట్టిన కేంద్రమంత్రి..?coronavirus;modi;rahul new;rahul;k l rahul;india;rahul gandhi;mohandas karamchand gandhi;g kishan reddy;media;december;job;september;minister;rahul sipligunj;central government;june;reddySun, 16 May 2021 08:14:00 GMTకరోనా నుంచి దేశాన్ని కాపాడేది కేవలం వ్యాక్సిన్ మాత్రమే. వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నా.. ప్రాణాలు పోయేంత సీరియస్ కాదు. అయితే మరి ఈ దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. ఈ ప్రశ్నకు ఇప్పటి వరకూ సరైన సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉంది. భారత్ బయోటెక్, సీరం సంస్థల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 కోట్ల డోసులు కూడా  లేదు. ఇలాంటి సమయంలో డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అంటే డిసెంబర్ వరకూ అందరికీ వ్యాక్సిన్ రాదన్నమాట. న్యూఢిల్లీలోని తన అధికార నివాసం నుంచి వర్చ్యువల్ మీడియా సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి వ్యాక్సినేషన్ వివరాలు వెల్లడించారు. కరోనా కట్టడి లో భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అందరికీ డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ దేశంలో 18 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిందని తెలియజేశారు.

రాహుల్ గాంధీ తో పాటు ఇతర రాజకీయ నాయకులు బిజెపిపై మోడీ పై ఎన్ని విమర్శలు చేసినా అవి పట్టించుకోకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా కేంద్రం పని చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో మొదటి 5 నాణ్యతగల టీకాలలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ ఉన్నాయని వాటి ఫార్ములా ఎక్స్చేంజ్ ద్వారా మరికొన్ని కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. జనాభాలో పెద్ద దేశంగా ఉన్న మన దేశంలో  130 కోట్ల మందికి రెండు డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలంటే 300 కోట్ల డోసు తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు.

సీరం కంపెనీ ఈ మే,జూన్ నెలలో ఒక్కో నెలకి 6 కోట్ల 5 లక్షల చొప్పున ఉత్పత్తి చేస్తూ డిసెంబర్ నాటికి నెలకు 11 కోట్ల 50 లక్షల డోస్ పెంచుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం మరియు భారత్ బయోటెక్ తీసుకువచ్చిన కోవాగ్జిన్ టీకా డోసులను మరో 4 కంపెనీలకు జాబ్ వర్క్ ఇచ్చి సెప్టెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభించి డిసెంబర్ నాటికి 15 కోట్ల 50 లక్షల డోసులను నెలకు  ఉత్పత్తి చేయనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఏదేమైనా అందరికీ వ్యాక్సిన్ అందాలంటే డిసెంబర్ వరకూ ఆగాలన్నమాట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్‌ కు సీనియర్‌ సలహాదారుగా భారతీయ మహిళ

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>