PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cyclone-effect-1a032a59-eb5f-4761-97b9-69f8ce1ccc8c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cyclone-effect-1a032a59-eb5f-4761-97b9-69f8ce1ccc8c-415x250-IndiaHerald.jpgఓవైపు కరోనా విలయం రాష్ట్రాలను కకావికలం చేస్తుంటే.. మరోవైపు తుఫాన్ ముప్పు భయపెడుతోంది. ఏకంగా 6 రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఆదివారానికి తుఫాన్ రూపంలో విరుచుకుపడుతుందని వాతావరణ విభాగం చెబుతోంది. దీనికి తౌక్టేగా పేరు పెట్టారు. ఈనెల 18న ఈ తుఫాన్ గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముంది. cyclone effect;varsha;kerala;maharashtra - mumbai;idukki;rayalaseema;karnataka 1;arabian sea;maharashtra;sea;oxygenముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 6 రాష్ట్రాలకు హెచ్చరిక..ముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 6 రాష్ట్రాలకు హెచ్చరిక..cyclone effect;varsha;kerala;maharashtra - mumbai;idukki;rayalaseema;karnataka 1;arabian sea;maharashtra;sea;oxygenSat, 15 May 2021 08:00:00 GMTఓవైపు కరోనా విలయం రాష్ట్రాలను కకావికలం చేస్తుంటే.. మరోవైపు తుఫాన్ ముప్పు భయపెడుతోంది. ఏకంగా 6 రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఆదివారానికి తుఫాన్ రూపంలో విరుచుకుపడుతుందని వాతావరణ విభాగం చెబుతోంది. దీనికి తౌక్టేగా పేరు పెట్టారు. ఈనెల 18న ఈ తుఫాన్ గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముంది.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతాతవరణ శాఖ హెచ్చరించింది. ‘తౌక్టే’ తుఫాన్ కారణంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని చెబుతున్నారు. తుఫాన్ ప్రభావం ఆల్రడీ కొల్లం జిల్లాలో కనిపిస్తోంది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.

తెలుగు రాష్ట్రాలకు కూడా వర్ష సూచన...
తౌక్టే తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు తుఫాన్ కి ప్రభావితం అవుతాయని అంటున్నారు అధికారులు. రాయలసీమతోపాటు దక్షిణ కోస్తాలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అంటున్నారు. సీమలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు.

కరోనా విలయంలో ఆస్పత్రులలో బెడ్ల లభ్య, ఆక్సిజన్ నిర్వహణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో అధికారులంతా బిజీగా ఉన్నారు. ఇప్పుడు తుఫాన్ ముప్పు అంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ విజృంభించకుండా ముందు జాగ్రత్తలు వహించాలి. దీంతో ఆరు రాష్ట్రాల అధికారులు తలలు పట్టుకున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత

వామ్మో.. అంతరిక్షంలో సినిమా షూటింగ్?

అటా ఇటా తేల్చండి.. కాంగ్రెస్‌లో ఈట‌ల కాక!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి శాశ్వతంగా ఛాన్స్ లేకుండా చేస్తున్న పిన్నెల్లి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>