ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/international-family-day8abcc478-543d-4da8-9a91-267229b81ae3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/international-family-day8abcc478-543d-4da8-9a91-267229b81ae3-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గా నిర్వహిస్తుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున ప్రతి కుటుంబం యొక్క ప్రాధాన్యతను వేడుక చేయడంతో పాటుగా కుటుంబాలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన మెరుగుపరిచేలా చేస్తారు. అంటే ఇందులో తప్పనిసరిగా మన కుటుంబాన్ని వేడుకలతో నింపడమే కాకుండా అది మనకు ఎంత ముఖ్యమో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు , అలాగే వారి ప్రాధాన్యతలు కూడా నిరంతరం మారుతూనే ఉన్న సందర్భాలు ఎన్నో చూసాము.. నిజానికి కుటుంబం అనేది దేవుడు ఇచ్చిన వరంగా ప్రతinternational-family-day;deva;jeevitha rajaseskhar;prema;december;history;love;assembly;internationalఅంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన కథనం..అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన కథనం..international-family-day;deva;jeevitha rajaseskhar;prema;december;history;love;assembly;internationalSat, 15 May 2021 13:56:22 GMT
ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గా నిర్వహిస్తుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున ప్రతి కుటుంబం యొక్క ప్రాధాన్యతను వేడుక చేయడంతో పాటుగా కుటుంబాలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన మెరుగుపరిచేలా చేస్తారు. అంటే ఇందులో తప్పనిసరిగా మన కుటుంబాన్ని వేడుకలతో నింపడమే కాకుండా అది మనకు ఎంత ముఖ్యమో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు , అలాగే వారి ప్రాధాన్యతలు కూడా నిరంతరం మారుతూనే ఉన్న సందర్భాలు ఎన్నో చూసాము..

నిజానికి కుటుంబం అనేది దేవుడు ఇచ్చిన వరంగా ప్రతి ఒక్కరు భావించాలి. కుటుంబం లేని ఒంటరి జీవితం ఎంత బతికినప్పటికి వృధానే అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు,  సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే షేర్ చేసుకుంటాము.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక అదే కుటుంబమే లేని రోజు మన బాధలు , మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా  , ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి. కుటుంబం అంటే సంతోషం, బాధ ,దుఃఖం ,ప్రేమ, అనుబంధాలు , ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం..

విభిన్న రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలు ఉన్న వ్యక్తులను ఒకే చోట అనుబంధంగా మార్చేది కుటుంబం. మన భారతీయ కుటుంబం. పిల్లల సంతోషాలను తమ సంతోషాలు గా భావించే తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కలలను సైతం నెరవేర్చాలని తపనపడే పిల్లలు ఇలా ఎల్లప్పుడూ ప్రేమ ఆత్మీయతతో కలిసుండేదే కుటుంబం.. నిజానికి దీని చరిత్ర ఏమిటంటే , 1983లో ఐక్యరాజ్యసమితి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల వైపు మళ్ళింది. ఇలా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సోషల్ డెవలప్మెంట్ కమిషన్ అప్పటి సెక్యూరిటీ జనరల్ కుటుంబాల సమస్యలు వాటి అవసరాల గురించి మరింత అవగాహన పెంచుకోవాలి అనుకుంది..


ఇక అనుకున్నదే తడవుగా మే 29 1985న ఆమోదించిన తీర్మానంలో, కౌన్సిల్ సిఫారస్ పై అసెంబ్లీ అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని కూడా చేర్చారు. అంతేకాకుండా 1989 డిసెంబర్ లో ప్రతి సంవత్సరం మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవాలని కూడా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఇందులో ముఖ్యంగా కుటుంబ సమస్యలను నియంత్రించే విషయాలను తెలియజేస్తుంది.. కుటుంబం అనేది ఎప్పుడూ ఉమ్మడి గా ఉండాలని, ఎవరు విడిపోకూడదు అని,  ఏవైనా సమస్యలు వస్తే సామరస్యంగా తీర్చుకోవాలని దీని ద్వారా ప్రకటించబడింది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>