MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5bbea76-2500-4593-b062-40483456e352-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5bbea76-2500-4593-b062-40483456e352-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ఉన్న అద్భుత నటుల్లో ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంటుంది. తనదైన నటనతో ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రకాల పాత్రల్లోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన నటనతో ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. దాదాపు 6 నంది..Tollywood;mahesh;naga chaitanya;kumaar;prakash raj;allu arjun;raj;seema;sukumar;india;cinema;telugu;rajani kanth;tamil;kannada;hindi;hero;yuva;kgfవిలక్షణ నటుడి జోరు.. ఒకేసారి అన్ని సినిమాలా..?విలక్షణ నటుడి జోరు.. ఒకేసారి అన్ని సినిమాలా..?Tollywood;mahesh;naga chaitanya;kumaar;prakash raj;allu arjun;raj;seema;sukumar;india;cinema;telugu;rajani kanth;tamil;kannada;hindi;hero;yuva;kgfSat, 15 May 2021 19:37:54 GMTటాలీవుడ్‌లో ఉన్న అద్భుత నటుల్లో ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంటుంది. తనదైన నటనతో ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రకాల పాత్రల్లోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన నటనతో ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. దాదాపు 6 నంది అవార్డులు, 8 తమిళనాడు ఫిలింఫేర్ అవార్డులు, సీమా అవార్డులు ఇలా మరెన్నో అవార్డులు అందుకున్నాడు. అయితే 1994లో తమిళంలో రిలీజ్ అయిన డ్యూయెట్ సినిమాతో చిత్ర సీమలోకి అరంగేట్రం చేశాడు.

 అయితే ప్రకాష్ రాజ్ కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ భాషల్లోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రతి భాషలోనూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ప్రకాష్ రాజ్ అనేక సినిమాలు తెరకెక్కించాడు. అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 8 సినిమాల్లో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు.

ప్రకాష్ రాజ్ తెలుగులో బన్నీ, సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాకుండా యువ హీరో అడవి శేష్ నటిస్తున్న ‘మేజర్’లో నటిస్తున్నాడు. దాంతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, నాగచైతన్య తాజా సినిమా ‘థాంక్యు’ సినిమాల్లోనూ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వీటితో పాటుగా కన్నడలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’, తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్, అన్నాత్తే, ఎనిమీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా హిందీలోనూ రెండు సినిమాలు చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఈ సినిమాలు తిరిగి ప్రారంభం అయితే  ప్రకాష్ రాజ్ ఫుల్ బిజీ అయిపోవడం ఖాయం. ప్రస్తుతం నాగచైతన్య థాంక్యు సినిమా టీమ్ మిగిలిన చిత్రీకరణ ముగించుకునేందుకు ప్రకాష్ రాజ్ కోసం వేచి చూస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కరోనా తాజా లెక్కలు..!!

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>