PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan8c7ea219-6ba0-495d-984b-693f5898c390-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan8c7ea219-6ba0-495d-984b-693f5898c390-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి రాగానే, గత చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేసిన విషయం తెలిసిందే. గతంలో బాబు ముద్ర ఉన్న ప్రతిదానికి జగన్ చెక్ పెట్టేశారు. ఇక గతంలో కంటే మిన్నగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే ప్రతి పథకంలోనూ జగన్ మార్క్ ఉంటుంది. అయితే గతంలో ప్రవేశ పెట్టిన ఏ పథకం ఆపినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు గానీ, చంద్రబాబు హయాంలో ప్రతి పేదవాడి ఆకలి తీరాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లని ఆపడంపై ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు.jagan;cbn;amala akkineni;jayalalitha;udhayanidhi stalin;jagan;y. s. rajasekhara reddy;government;tamilnadu;cheque;tdp;stalinవైఎస్సార్ క్యాంటీన్...బాబుకి ప్లస్ అవుతుందా?వైఎస్సార్ క్యాంటీన్...బాబుకి ప్లస్ అవుతుందా?jagan;cbn;amala akkineni;jayalalitha;udhayanidhi stalin;jagan;y. s. rajasekhara reddy;government;tamilnadu;cheque;tdp;stalinSat, 15 May 2021 01:00:00 GMTజగన్ అధికారంలోకి రాగానే, గత చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేసిన విషయం తెలిసిందే. గతంలో బాబు ముద్ర ఉన్న ప్రతిదానికి జగన్ చెక్ పెట్టేశారు. ఇక గతంలో కంటే మిన్నగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే ప్రతి పథకంలోనూ జగన్ మార్క్ ఉంటుంది. అయితే గతంలో ప్రవేశ పెట్టిన ఏ పథకం ఆపినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు గానీ, చంద్రబాబు హయాంలో ప్రతి పేదవాడి ఆకలి తీరాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లని ఆపడంపై ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు.


గత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు రూ. 5 లకే భోజనం అందించింది. అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు, కూలీలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించింది. ఇక ఈ క్యాంటీన్ ద్వారా చాలామంది పేదలు లబ్ది పొందారు. అయితే జగన్ అధికారంలోకి రాగానే క్యాంటీన్లకు మూతవేసింది. ఇక ఇందులో కొన్ని క్యాంటీన్లని వార్డు సచివాలయాలుగా వాడుకుంటుంది.


అయితే ఇలా పేద ప్రజలకు ఉపయోగపడే క్యాంటీన్లు మూసివేయడంపై టీడీపీ రెండేళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉంది. కనీసం వాటికి వైఎస్సార్ క్యాంటీన్ అని పేరు పెట్టి నడిపించాలని కోరింది. కానీ జగన్ మాత్రం క్యాంటీన్ల గురించి ఎక్కడా పట్టించుకోలేదు. ఒకవేళ వాటిని ఓపెన్ చేసి రన్ చేస్తే, చంద్రబాబుకు బెన్‌ఫిట్ అవుతుందని అనుకున్నారేమో గానీ, క్యాంటీన్ల జోలికే వెళ్లలేదు.


కానీ తాజాగా తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డి‌ఎం‌కే అధినేత స్టాలిన్ సీఎం అయ్యాక, గత అన్నాడి‌ఎం‌కే ప్రభుత్వంలో పెట్టిన అమ్మ క్యాంటీన్లని మూసివేయకుండా, అది పేరు, అదే జయలలిత బొమ్మతో రన్ చేస్తున్నారు. ఇక ఇది చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదలకు అన్నం లేకుండా చేశారని ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే అన్నా క్యాంటీన్ల విషయంలో జగన్ లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?

ర‌ఘురామ అరెస్టులో హైడ్రామా... ఎక్క‌డ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>