PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinash-and-vamsi-collapse-tdp-35270627-1473-4575-9a06-87fce2f356cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinash-and-vamsi-collapse-tdp-35270627-1473-4575-9a06-87fce2f356cf-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా విజయవాడ రాజకీయాల్లో కమ్మ నేతల డామినేషన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులోనూ టీడీపీలోని కమ్మ నాయకుల హవా ఎక్కువగా ఉంటుంది. విజయవాడలో గానీ, చుట్టుపక్కన ఉన్న నియోజకవర్గాల్లో ఈ కమ్మ నాయకులదే పెత్తనం. విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉంటే, తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. అటు మైలవరం ఇన్‌చార్జ్‌గా దేవినేని ఉమా, పెనమలూరుకు బోడే ప్రసాద్ ఉన్నారు. ఇటు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు.avinash;nani;arjuna;prasad;vamsi;krishna river;kamma;gadde rama mohan;vijayawada;devineni avinash;2019;district;east;kesineni nani;gannavaram;vallabhaneni vamsi;mla;cheque;krishna district;tdp;ycp;mylavaram;devineni uma maheswara rao;penamaluru;bode prasadబెజవాడ పాలిటిక్స్: అవినాష్, వంశీ దెబ్బవేసేశారుగా!బెజవాడ పాలిటిక్స్: అవినాష్, వంశీ దెబ్బవేసేశారుగా!avinash;nani;arjuna;prasad;vamsi;krishna river;kamma;gadde rama mohan;vijayawada;devineni avinash;2019;district;east;kesineni nani;gannavaram;vallabhaneni vamsi;mla;cheque;krishna district;tdp;ycp;mylavaram;devineni uma maheswara rao;penamaluru;bode prasadSat, 15 May 2021 03:00:00 GMTకృష్ణా జిల్లా విజయవాడ రాజకీయాల్లో కమ్మ నేతల డామినేషన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులోనూ టీడీపీలోని కమ్మ నాయకుల హవా ఎక్కువగా ఉంటుంది. విజయవాడలో గానీ, చుట్టుపక్కన ఉన్న నియోజకవర్గాల్లో ఈ కమ్మ నాయకులదే పెత్తనం. విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉంటే, తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. అటు మైలవరం ఇన్‌చార్జ్‌గా దేవినేని ఉమా, పెనమలూరుకు బోడే ప్రసాద్ ఉన్నారు. ఇటు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు.


అయితే టీడీపీలోని కమ్మ నాయకులకు చెక్ పెట్టాలంటే అదే సామాజికవర్గానికి చెందిన నేతలే ఉండాలి. అందుకే 2019 ఎన్నికల్లో మైలవరంలో దేవినేని ఉమా మీద వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్‌ని నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో వసంత విజయం సాధించారు. అటు పెనమలూరులో బోడే ప్రసాద్‌పై యాదవ సామాజికవర్గానికి చెందిన పార్థసారథి విజయం సాధించారు.


ఇక తూర్పు నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు చెక్ పెట్టడానికి దేవినేని అవినాష్‌ని పార్టీలోకి తీసుకున్నారు. అయితే అవినాష్ వచ్చాక తూర్పులో పరిస్తితి చాలా మారింది. అవినాష్ ఇక్కడ వైసీపీని బలోపేతం చేస్తున్నారు. గద్దెకు ధీటుగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉండటంతో ఎమ్మెల్యే కంటే ఎక్కువే పనులు చేస్తున్నారు. దీని వల్ల తూర్పులో వైసీపీకి బాగా బలం పెరిగింది. అలా బలం పెరగడం వల్లే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ జెండా ఎగిరింది.


ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే వంశీ వైసీపీలోకి వచ్చారో అప్పటినుంచి గన్నవరంలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. అసలు ఇక్కడ టీడీపీ జెండా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ తరుపున బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నారు. అయినా సరే టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. మొత్తానికైతే విజయవాడ రాజకీయాల్లో వైసీపీ హవా బాగా పెరిగింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?

ర‌ఘురామ అరెస్టులో హైడ్రామా... ఎక్క‌డ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>