HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eacidete-matralu-danger8edc45a8-2505-4f3c-9c5b-29cb898a541c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eacidete-matralu-danger8edc45a8-2505-4f3c-9c5b-29cb898a541c-415x250-IndiaHerald.jpgమారిన జీవన విధానం, మారిన అలవాట్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంట్లో తినడం మానేసి బయట తినే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. అంతేకాకుండా ఫంక్షన్లు,పార్టీలలో ఎక్కువగా బిర్యానీలు, చికెన్,మటన్,ఫిష్ తో అనేక వంటకాలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మనలో చాలా మంది ఏదైనా వంటకం నచ్చిందంటే చాలు.. అతిగా తినేస్తుంటారు. ఇక తిన్న తర్వాత కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతూ వుంటారు. అవన్నీ తినడం వల్ల గ్యాస్, ఉబకాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికేEACIDETE MATRALU DANGER;american samoa;kanna lakshminarayana;chicken;cumin;acidity;ee rojulloఎసిడిటీ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారా ? అయితే జర జాగ్రత్త !ఎసిడిటీ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారా ? అయితే జర జాగ్రత్త !EACIDETE MATRALU DANGER;american samoa;kanna lakshminarayana;chicken;cumin;acidity;ee rojulloSat, 15 May 2021 18:00:00 GMT
మారిన జీవన విధానం, మారిన అలవాట్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంట్లో తినడం మానేసి బయట తినే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. అంతేకాకుండా ఫంక్షన్లు,పార్టీలలో ఎక్కువగా బిర్యానీలు, చికెన్,మటన్,ఫిష్ తో అనేక వంటకాలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మనలో చాలా మంది ఏదైనా వంటకం నచ్చిందంటే చాలు.. అతిగా తినేస్తుంటారు. ఇక తిన్న తర్వాత కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతూ వుంటారు. అవన్నీ తినడం వల్ల గ్యాస్, ఉబకాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే ఎసిడిటీ మాత్రలు, పౌడర్లను వేసుకుని తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతున్నారు. అయితే వీటిని వాడడం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని వాడడం వల్ల అనేక  రకాల సమస్యలు వస్తాయని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది.


అమెరికాలోని వాషింగ్టన్ లోని పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఎసిడిటి మాత్రలు వాడుతున్న  దాదాపు  2,75,000 మందిపై వీరు పరిశోధనలు చేశారు. వారిలో ఎసిడిటి మాత్రలు వేసుకునే వారిలో మరణం రేటు 50 శాతం పెరుగుతుందని తేల్చారు.

అతిగా తిని ఉబ్బరంతో మాత్రలు వేసుకోవడం కన్నా తక్కువగా తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎసిడిటీ వచ్చినప్పుడు సహజసిద్ధమైన పదార్థాలతో తగ్గించే ప్రయత్నం చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పటికీ తగ్గకపోతే ఎసిడిటి మాత్రలు లేదా పౌడర్ జోలికి వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ మీలో అసిడిటీ ఎక్కువ అయినప్పుడు, జీలకర్ర ను తీసుకొని కొద్దిగా వేయించి, ఆ తరువాత చల్లార్చి పొడి చేసుకోవాలి. ఇక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేయాలి. ఆ తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు కూడా కలిపి, బాగా మిక్స్ చేయాలి. ఇక ఎసిడిటీ గా అనిపించినప్పుడు దీన్ని తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ - రఘురామ మధ్య వివాదానికి కారణం ఆ సంఘటనే ?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>