PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown160e7e6d-9da3-499f-83b6-e6e73cbbeb16-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown160e7e6d-9da3-499f-83b6-e6e73cbbeb16-415x250-IndiaHerald.jpgకరోనా ధాటికి తాళలేక దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టాయి. లాక్ డౌన్ పెట్టినప్పటికీ, జనసంద్రం తగ్గడం లేదు. దాదాపు చాలా వరకు మాస్కులు ధరిస్తున్నా, సామాజిక దూరం పాటించడం లేదన్నది వాస్తవం. దీనితో కేసులు సంఖ్య తగ్గడం లేదు. ఇదంతా ఇలా ఉంటే లాక్ డౌన్ వలన ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. LOCKDOWN;smart phone;television;letter;coronavirusలాక్ డౌన్: పిల్లల ప్రవర్తనలో మార్పులు ... తల్లిదండ్రులలో ఒత్తిడి ?లాక్ డౌన్: పిల్లల ప్రవర్తనలో మార్పులు ... తల్లిదండ్రులలో ఒత్తిడి ?LOCKDOWN;smart phone;television;letter;coronavirusSat, 15 May 2021 14:00:00 GMTకరోనా ధాటికి తాళలేక దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టాయి. లాక్ డౌన్ పెట్టినప్పటికీ, జనసంద్రం తగ్గడం లేదు. దాదాపు చాలా వరకు మాస్కులు ధరిస్తున్నా, సామాజిక దూరం పాటించడం లేదన్నది వాస్తవం. దీనితో కేసులు సంఖ్య తగ్గడం లేదు. ఇదంతా ఇలా ఉంటే లాక్ డౌన్ వలన ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మాములుగా అయితే, పిల్లలంటే బయటకెళ్ళి ఆడుతూ పాడుతూ గంతులేస్తూ సరదాగా ఉంటారు. లాక్ డౌన్ కావడంతో బయటకెళ్లడానికి వీల్లేదు. కనీసం పక్కింట్లో ఉన్న స్నేహితులను కూడా కలిసే అవకాశం లేదు. రోజంతా ఇంట్లోనే ఉంటూ సమయాన్ని గడపాలి. ఎంతసేపని టీవీ చూస్తూ, ఫోన్ మరియు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉండగలరు. అంతే కాకుండా ఇంట్లో తల్లితండ్రులు కూడా కరోనా వైరస్ పేరుతో ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇందుకు మానసిక నిపుణులు, ఈ విధానం వారి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని తల్లితండ్రులను హెచ్చరిస్తున్నారు. 

ఇలా పిల్ల పట్ల కఠినంగా వ్యవహరించడం వలన వారి ప్రవర్తనలో మార్పులు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. నిరంతర జీవితానికి అలవాటు పడిన వారు ఒక్కసారిగా ఇంట్లోనే నిర్బంధించినట్లుగా చేయడం వలన మానసికంగా ఇబ్బందిపడే అవకాశముందని చెబుతున్నారు. ఈ విధంగా అలవాటు పడడం వలన పిల్లల స్వభావంలో మార్పు వస్తోందని ఇప్పటికే చాలా మంది తల్లితండ్రులు డాక్టర్స్ ను సంప్రదించినట్లు వీరు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో పిల్లలు, తల్లితండ్రుల పట్ల ఎక్కువ కోపానికి లోనవుతున్నారని చెప్పినట్లుగా వారు చెప్పారు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో తల్లితండ్రులు పిల్లల్ని చూసే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. 

ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లల పట్ల ప్రేమగా మెలగండి, ఏ విషయాన్ని అయినా సున్నితంగా తెలియచేయండి. వారితో ఒక స్నేహితునిలాగా మాట్లాడండి. వారికున్న సమస్యను తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నించండి. మీరు వారితో మంచి విషయాలనే మాట్లాడండి. వీలైనంత ఎక్కువ సమయాన్ని మీ పిల్లలతో గడపండి అని సలహాలు ఇస్తున్నారు. ఈ విధంగా పిల్లలు మా వల్లనే ఇలా అయిపోతున్నారని తెలుసుకున్న తల్లితండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక వైద్య నిపుణులు చెప్పినట్లుగా సలహాలను పాటిస్తే పిల్లలు మంచిగా ఉంటారని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>