MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keka-putisstunaa-rgv-dee-company7b6474d9-73c7-4fcf-a14e-45c01abb3bce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keka-putisstunaa-rgv-dee-company7b6474d9-73c7-4fcf-a14e-45c01abb3bce-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా థీయేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ప్లాట్‌ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి వల్ల ప్రజలు థీయేటర్లకు వెళ్లేందుకు జంకుతు ఇంట్లోనే చిన్న స్క్రీన్‌పై సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో కొత్తకొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంతో తాజాగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఓటీటీ బాట పట్టాడు. ఆయన సొంతంగా స్పార్క్‌ అనే పేరుతో ఓటీటీ ని సాగర్ మాచానూరు తో కలిసి స్థాపించారు. rgv;ram gopal varma;jeevitha rajaseskhar;ram madhav;cinema;media;tamil;producer;kannada;hindi;producer1;vegetable market;yuva;research and analysis wing;wantedవర్మ ఓటిటి కి భారీ క్రేజ్... అప్పుడే లక్ష మంది?వర్మ ఓటిటి కి భారీ క్రేజ్... అప్పుడే లక్ష మంది?rgv;ram gopal varma;jeevitha rajaseskhar;ram madhav;cinema;media;tamil;producer;kannada;hindi;producer1;vegetable market;yuva;research and analysis wing;wantedSat, 15 May 2021 16:30:00 GMTకరోనా కారణంగా థీయేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ప్లాట్‌ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి వల్ల ప్రజలు థీయేటర్లకు వెళ్లేందుకు జంకుతు ఇంట్లోనే చిన్న స్క్రీన్‌పై సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో కొత్తకొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంతో తాజాగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఓటీటీ బాట పట్టాడు. ఆయన సొంతంగా స్పార్క్‌ అనే పేరుతో ఓటీటీ ని సాగర్ మాచానూరు తో కలిసి స్థాపించారు.

భారత ఓటీటీ రంగంలో సరికొత్తగానే కాకుండా అన్ని రకాల ప్రేక్షకుల డిమాండ్లను తీర్చేలా స్పార్క్ ఓటీటీ రంగంలోకి దిగింది. భారత ఓటీటీ మార్కెట్ లో పెను ప్రభంజనం సృష్టించేలా స్పార్క్ ఓటీటీని రూపుదిద్దిన‌ట్లు ఆ సంస్థ అధినేత‌, యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరు ఘ‌నంగా ప్ర‌క‌టించారు.మే 15వ తేదీన అంటే ఈరోజు నుంచి భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘డీ కంపెనీ’ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ సేవలు ప్రారంభం అయ్యాయి.అయితే ప్రారంభం అయిన 12 గంటల్లోనే దాదాపుగా లక్ష మంది ఈ ఓటిటిలో సభ్యత్వాన్ని పొందారు అని ఆర్జివి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఓటీటీ రంగంలో ఇప్పటికే చాలా సంస్థలే ఉన్నా.. స్పార్క్ ఓటీటీ తనదైన శైలి ఒరిజినల్ వెబ్ సిరీస్, ఐదు భాషలకు చెందిన సంచలన చలన చిత్రాలతో తనదైన ముద్రను వేయనుందని సాగర్ మాచనూరు తెలిపారు. దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వర్మ ప్రాజెక్టులతో పాటు స్పార్క్ ఓటీటీ... తన సొంత కథాకథనాలతో రూపొందించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలకు చెందిన పాపులర్ చిత్రాలను కూడా ప్రసారం చేయనుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>