HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tips-sugar-control4ca86100-8602-4a39-9ef5-66fe97e7381f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tips-sugar-control4ca86100-8602-4a39-9ef5-66fe97e7381f-415x250-IndiaHerald.jpgప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క‌ల ప్రకారం మ‌ధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి నివార‌ణ లేక‌పోవ‌డంతో ఆహారం, జీవనశైలి మార్పులతో నియంత్రించుకోవ‌డ‌మేన‌ని సంస్థ చెబుతోంది. దీన్ని స్లోపాయిజ‌న్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఎందుకంటే శ‌రీరంలోని ఇత‌ర భాగాల‌ను కూడా మ‌ధుమేహం ప్ర‌భావితం చేస్తుంటుంది. ఈ వ్యాధి ఉన్న రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవ‌డానికి ఔష‌ధాలు, ఇన్సులిన్ తీసుకుంటుండాలి. ప్ర‌తిరోజు మూడువేళ‌ల్లో స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌డంవ‌ల్ల ఇది అదుపులో ఉంటుంది. ఇంగ్లిషు మందులు ఎన్ని వాడుhealth tips, sugar control;nithya new;mandula;heart;cancer;sugar;ayurveda;antioxidant;cinnamon;insulin;chris lynnదాల్చిన‌చెక్క‌తో మ‌ధుమేహాన్ని నియంత్రించ‌వ‌చ్చా?దాల్చిన‌చెక్క‌తో మ‌ధుమేహాన్ని నియంత్రించ‌వ‌చ్చా?health tips, sugar control;nithya new;mandula;heart;cancer;sugar;ayurveda;antioxidant;cinnamon;insulin;chris lynnSat, 15 May 2021 10:40:29 GMT
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క‌ల ప్రకారం మ‌ధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి నివార‌ణ లేక‌పోవ‌డంతో ఆహారం, జీవనశైలి మార్పులతో నియంత్రించుకోవ‌డ‌మేన‌ని సంస్థ చెబుతోంది. దీన్ని స్లోపాయిజ‌న్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఎందుకంటే శ‌రీరంలోని ఇత‌ర భాగాల‌ను కూడా మ‌ధుమేహం ప్ర‌భావితం చేస్తుంటుంది. ఈ వ్యాధి ఉన్న రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవ‌డానికి ఔష‌ధాలు, ఇన్సులిన్ తీసుకుంటుండాలి. ప్ర‌తిరోజు మూడువేళ‌ల్లో స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌డంవ‌ల్ల ఇది అదుపులో ఉంటుంది. ఇంగ్లిషు మందులు ఎన్ని వాడుతున్నా మ‌న భార‌తీయ ఆయుర్వేదం ప్ర‌కారం మ‌ధుమేహాన్ని త‌గ్గించ‌డానికి ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

వంట‌గ‌దే వ్యాధి నిరోధ‌కం!
సాధార‌ణంగా మ‌న వంట‌గ‌దిలో దాల్చిన చెక్క క‌నిపిస్తుంటుంది. ఆహారాన్ని రుచికరంగా మార్చడంతో పాటు పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. టైప్ -2 డయాబెటిస్‌తో బాధ‌ప‌డేవారిలో రక్తం చక్కెర స్థాయిని నియంత్రించ‌డానికి ఇందులోని ఔషధ గుణాలు బాగా సహాయపడతాయి. అందుకే డయాబెటిస్, దాల్చినచెక్కల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. నిపుణులు కూడా దాల్చినచెక్కను వాడాలని సూచిస్తున్నారు. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. శరీరంతో పాటు చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తాయి. రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంద‌ని తేలింది. నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క‌ పొడిని తీసుకుంటుంటే ఇందులో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. టైప్ 2 మధుమేహాన్ని తగ్గించి పరిస్థితిని మెరుగుపరిచి, ఇన్సులిన్ సెన్సిటివిటీని శరీరంలో మెరుగుపరుస్తుంది.

మితంగానే తీసుకోవాలి!
అయితే దాల్చిన చెక్క‌ను అధికంగా వాడటం వ‌ల్ల కూడా ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. దాల్చినచెక్కను ప‌రిమితి లేకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోటి పూత, రక్తంలో తక్కువ గ్లూకోజ్, శ్వాసకోశ సమస్యలను క‌లిగించే ప్ర‌మాద‌ముండ‌టంతో నిపుణులైన వైద్యుల స‌ల‌హా మేర‌కే ఉప‌యోగించాల‌ని చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>