EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kamal-hassan-makkal-needi-mayyam-tamilnadu-politics-4b9b7fbd-5234-42eb-84f6-fec65b3ffad1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kamal-hassan-makkal-needi-mayyam-tamilnadu-politics-4b9b7fbd-5234-42eb-84f6-fec65b3ffad1-415x250-IndiaHerald.jpg2019 లోక్ సభ ఎన్నికల్లో 4శాతం ఓట్లు రావడంతో.. ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకున్నారు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యం పార్టీకి అసెంబ్లీలో ఎంట్రీ లభిస్తుందని ఆశించి భంగపడ్డారు. కనీసం డీఎంకే, అన్నాడీఎంకే పోటీలో లేని కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోదిగిన కమల్ హాసన్ కూడా గెలవలేకపోయారు. ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కట్ చేస్తే.. ఇప్పుడు పార్టీ కష్టాల్లో పడిపోయింది. కమల్ హాసన్ టీమ్ నుంచి ఒక్కొక్కరే బయటకు వెళ్లిపోతున్నారు. మొదటినుంచి పార్టీని అంటి పెట్టుకున్నవారు, పార్టీలో కమkamal hassan, makkal needi mayyam, tamilnadu politics,;kamal hassan;mahendran;padmapriya;santhosh;korea, south;coimbatore;2019;రాజీనామా;assembly;santhossh jagarlapudi;partyఖాళీ అవుతున్న 'కమల్'దళం..ఖాళీ అవుతున్న 'కమల్'దళం..kamal hassan, makkal needi mayyam, tamilnadu politics,;kamal hassan;mahendran;padmapriya;santhosh;korea, south;coimbatore;2019;రాజీనామా;assembly;santhossh jagarlapudi;partySat, 15 May 2021 09:00:00 GMT2019 లోక్ సభ ఎన్నికల్లో 4శాతం ఓట్లు రావడంతో.. ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకున్నారు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యం పార్టీకి అసెంబ్లీలో ఎంట్రీ లభిస్తుందని ఆశించి భంగపడ్డారు. కనీసం డీఎంకే, అన్నాడీఎంకే పోటీలో లేని కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోదిగిన కమల్ హాసన్ కూడా గెలవలేకపోయారు. ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కట్ చేస్తే.. ఇప్పుడు పార్టీ కష్టాల్లో పడిపోయింది. కమల్ హాసన్ టీమ్ నుంచి ఒక్కొక్కరే బయటకు వెళ్లిపోతున్నారు. మొదటినుంచి పార్టీని అంటి పెట్టుకున్నవారు, పార్టీలో కమల్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా 'మక్కల్ నీది మయ్యం' ను వీడిపోతున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి 'మక్కల్ నీది మయ్యం' పార్టీని ఒక్కొక్కరే వీడిపోతున్నారు. అందరికంటే ముందుగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వెళ్తే వెళ్లారు కానీ కమల్ హాసన్ పై ఆయన చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కమల్ హాసన్ కి పార్టీ నడపడం చేతకాదని, పార్టీలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సరిదిద్దే సత్తా కమల్ దగ్గర లేదని చెబుతున్నారు. పార్టీని ఇలాగే నడుపుతుంటే ఇక ఎప్పటికీ గెలవలేదంటూ వ్యాఖ్యానించారు. అయితే మహేంద్రన్ వ్యాఖ్యలపై ఇంతవరకు కమల్ హాసన్ స్పందించకపోవడం గమనార్హం.

తాజాగా కమల్ పార్టీకి మరో ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడించినా, కమల్ నాయకత్వంపై నమ్మకం లేక, ఇక పార్టీకి భవిష్యత్ లేదని నిర్ణయించుకున్న తర్వాతే బయటకు వెళ్లారని తెలుస్తోంది. కమల్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో మాజీ ఐఏఎస్ సంతోష్ బాబు, సామాజికవేత్త పద్మప్రియ కూడా ఉన్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్ర తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరించింది సంతోష్ బాబే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం తరఫున పోటీచేసిన వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. చివరకు పార్టీని వీడారు. కమల్ పై నిందలు వేశారు. అటు కమల్ హాసన్ కూడా ఓటమితో తీవ్ర నిరాశ చెందారని, ఆయన ఇక సినిమాలకే పరిమితం అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత

వామ్మో.. అంతరిక్షంలో సినిమా షూటింగ్?

అటా ఇటా తేల్చండి.. కాంగ్రెస్‌లో ఈట‌ల కాక!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>