MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khannab65ae2f3-05cf-4063-a077-4f701f4e2547-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khannab65ae2f3-05cf-4063-a077-4f701f4e2547-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఇబ్బంది పడిన బాధితులను ఆదుకునేందుకు ఎందరో సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్ విధించినప్పుడు ఇబ్బంది పడిన వారికి సహాయం చేసిన సోనూసూద్ రీల్ విలన్ అయినా రియల్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు..rashi khanna;beauty;raasi;tollywood;cinema;heroine;oxygen;rashi khannaరియల్ హీరోగా మారిన హీరోయిన్.. వారికి అండగా..రియల్ హీరోగా మారిన హీరోయిన్.. వారికి అండగా..rashi khanna;beauty;raasi;tollywood;cinema;heroine;oxygen;rashi khannaSat, 15 May 2021 11:21:10 GMTకరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఇబ్బంది పడిన బాధితులను ఆదుకునేందుకు ఎందరో సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్ విధించినప్పుడు ఇబ్బంది పడిన వారికి సహాయం చేసిన సోనూసూద్ రీల్ విలన్ అయినా రియల్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు కూడా విదేశాలతో మంతనాలు జరిపి ఆక్సిజన్ ప్లాంట్‌లను భారత్‌కు తెప్పిస్తున్నాడు. తాజాగా ఈ విధమైన సహాయం అందిస్తున్న వారి జాబితాలోకి టాలీవుడ్ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా కూడా చేరింది.


రాశీ ఖన్నా ప్రస్తుతం దాదాపు 8 సినిమాల్లో నటిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలో పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో సినిమా చిత్రీకరణలు నిలిచిపోయాయి. అంతేకాకుండా పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ తరుణంలో ఎందరో అనాథలు, భిక్షగాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సహాయం చేసేందుకు తారలు ఎందరో ముందుకు వస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా కూడా తన వంతు సహాయం అందిస్తోంది. అంతేకాకుండా తాను చేస్తున్న సహాయానికి ఎటువంటి పబ్లిసిటీ కూడా చేసుకోవడం లేదు. దాంతో రాశి రీల్ హీరోయిన్ కూడా రియల్ హీరోగా మారిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


అయితే ప్రస్తుతం రాశీ ఖన్నా తన వెబ్ సిరీస్ చిత్రీకరణ నిమిత్తం ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే. అదే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో అమ్మడు అక్కడే నిలిచిపోయింది. అయితే ఈ ఖాళీ సమయంలో అక్కడి అనాథలకు, బిక్షగాళ్లతో పాటు రోడ్డు పక్కన నివసించే వారిని ఆదుకునే పని చేపట్టింది. ఇందులో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి వారికి ఆహారం సమకూర్చడంలో పాలుపంచుకుంటోంది. దీని కోసం ఓ ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వారు ఈ సంస్థతో కలిసి ఆహారాన్ని సమకూరుస్తున్నారు. తాను ఇలా చేస్తున్నట్లు ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదు. ఇదే తరహాలో మరికొందరు తారలు కూడా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>