MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-ram-pothineni049e40e7-8cef-462a-91ef-6d34c703541d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-ram-pothineni049e40e7-8cef-462a-91ef-6d34c703541d-415x250-IndiaHerald.jpg రామ్ పోతినేని.. సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా అడిగుపెట్టి , తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రామ్ కూడా ఒకరు. రామ్ 1987 మే 15వ తేదీన జన్మించాడు. నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకే రామ్ పోతినేని.. రామ్ హైదరాబాదులో పుట్టినా, తన విద్యాభ్యాసాన్ని మాత్రం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమం, సెంటర్ జాన్ పాఠశాలలో అభ్యసించాడు. ఇక తన పెదనాన్న అయిన స్రవంతి కిషోర్ సహాయంతో నటశిక్షకుడైన ఎన్ జె భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత మొట్HBD RAM POTHINENI;kumaar;b gopal;choudary actor;jeevitha rajaseskhar;murali;ram pothineni;shankar;sravanti ravikishore;srinu vytla;sukumar;cinema;january;jaan;producer;ismart shankar;tamilnadu;producer1;heroine;success;march;john;ileana d'cruz;mass;chitram;loverరామ్ సినీ జీవితం అలా మొదలైందా ?రామ్ సినీ జీవితం అలా మొదలైందా ?HBD RAM POTHINENI;kumaar;b gopal;choudary actor;jeevitha rajaseskhar;murali;ram pothineni;shankar;sravanti ravikishore;srinu vytla;sukumar;cinema;january;jaan;producer;ismart shankar;tamilnadu;producer1;heroine;success;march;john;ileana d'cruz;mass;chitram;loverSat, 15 May 2021 09:12:56 GMT
రామ్ పోతినేని.. సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా అడిగుపెట్టి , తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రామ్ కూడా ఒకరు. రామ్ 1987 మే 15వ తేదీన జన్మించాడు. నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకే రామ్ పోతినేని.. రామ్ హైదరాబాదులో పుట్టినా, తన విద్యాభ్యాసాన్ని మాత్రం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమం, సెంటర్ జాన్ పాఠశాలలో అభ్యసించాడు. ఇక తన పెదనాన్న అయిన స్రవంతి కిషోర్ సహాయంతో నటశిక్షకుడైన ఎన్ జె భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.


తర్వాత మొట్టమొదటి సారిగా దేవదాసు చిత్రానికి  హీరోగా ఎంపికయ్యాడు. ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇక హీరోయిన్ గా ఇలియానా మొట్టమొదటిసారి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదల కాగా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొని, అటు ఇలియానాకు ఇటు రామ్ కు మంచి సినీ కెరియర్ ను అందించింది ఈ సినిమా. అంతేకాకుండా  రామ్ కి  ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. ఇక ఆ తర్వాత తన రెండవ చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం 2007 మార్చి 16వ తేదీన విడుదలైంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా  మిగిలినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది..

ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో  జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించాడు. ఇక ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రామ్ పెద్ద హీరోల లో ఒకడిగా ఎదిగాడు. ఇక 2009లో ఏకంగా రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మస్కా, మరో చిత్రం ఎన్ శరవణన్ దర్శకత్వంలో వచ్చిన గణేష్. ఈ రెండు చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయినా  రామ్ నటనకు ప్రశంసలు మాత్రం సొంతమయ్యాయి..

ఇలా ఎన్నో సినిమాలలో నటించి లవర్ బాయ్ గా, ఒక మంచి స్నేహితుడి గా పేరుతెచ్చుకున్న రామ్, ఇస్మార్ట్ శంకర్ ద్వారా తన లో దాగి ఉన్న మరొక మాస్ యాంగిల్ ను  ప్రేక్షకులకు చూపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నడూ లేని విధంగా పూర్తిగా మాస్ క్యారెక్టర్లో నటించి, రామ్ లో ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా అని  ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చేశాడు.. ఇలా రామ్ సినీ జీవితం మొదలై, సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్లిపోతున్నాడు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత

వామ్మో.. అంతరిక్షంలో సినిమా షూటింగ్?

అటా ఇటా తేల్చండి.. కాంగ్రెస్‌లో ఈట‌ల కాక!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>