PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuramakrishnam0829f24b-77e3-4343-966f-e43777829252-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuramakrishnam0829f24b-77e3-4343-966f-e43777829252-415x250-IndiaHerald.jpgవైసీపీ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో ర‌ఘురామ విమ‌ర్శిస్తున్నా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మౌనంగా ఉండిపోయారు. అడ‌పాద‌డ‌పా వైసీపీలోని ప‌లువురు నేత‌లు మిన‌హా ఆర్ఆర్ఆర్ వ్యాఖ్య‌ల‌ను పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలోనే పార్టీ నేత‌ల్లో త‌ప్పుడు సంకేతాలు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. గ‌త సంవ‌త్స‌ర కాలంగా ర‌ఘురామరాజు ప్ర‌భుత్వంపైన‌, త‌న‌పైన‌ విమ‌ర్శ‌లు చేస్తున్నా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. మ‌నం గీత‌దాటినా ఏం చేస్తారులే అన్న భావ‌న‌కు కొంద‌రు నేత‌లు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీనికితోడు ప‌లు జిల్లాల్లో సీనRaghuramakrishnam;andhra pradesh;rrr movie;mp;police;court;arrest;ycp;partyర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?Raghuramakrishnam;andhra pradesh;rrr movie;mp;police;court;arrest;ycp;partySat, 15 May 2021 11:21:21 GMTప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించాడ‌ని, కులాల మ‌ధ్య వైష‌మ్యాలు సృష్టించేలా వ్యాఖ్య‌లు ఉన్నాయంటూ వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం విధిత‌మే. ర‌ఘురామ అరెస్టుతో సొంత పార్టీలోని అస‌మ్మ‌తి వ‌ర్గానికి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చార‌న్న వాద‌న వినిపిస్తుంది. వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌రాజు గ‌త కొంత‌కాలంగా ఆ పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తీరుపైనా మండిప‌డుతున్నారు. తాజాగా జ‌గ‌న్‌కు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ కోర్టును సైతం ర‌ఘురామ ఆశ్ర‌యించాడు. ఇన్నాళ్లు ర‌ఘురామ వ్యాఖ్య‌ల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోని జ‌గ‌న్ ఉన్న‌ట్లుడి ఒక్క‌సారిగా అరెస్టు చేయించ‌టం వెనుక అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

వైసీపీ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో ర‌ఘురామ విమ‌ర్శిస్తున్నా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మౌనంగా ఉండిపోయారు. అడ‌పాద‌డ‌పా వైసీపీలోని ప‌లువురు నేత‌లు మిన‌హా ఆర్ఆర్ఆర్ వ్యాఖ్య‌ల‌ను పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలోనే పార్టీ నేత‌ల్లో త‌ప్పుడు సంకేతాలు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. గ‌త సంవ‌త్స‌ర కాలంగా ర‌ఘురామరాజు ప్ర‌భుత్వంపైన‌, త‌న‌పైన‌ విమ‌ర్శ‌లు చేస్తున్నా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. మ‌నం గీత‌దాటినా ఏం చేస్తారులే అన్న భావ‌న‌కు కొంద‌రు నేత‌లు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీనికితోడు ప‌లు జిల్లాల్లో సీనియ‌ర్ నేత‌లు జ‌గ‌న్ ఆదేశాల‌ను పూర్తిగా విస్మ‌రిస్తున్నార‌న్న వాద‌నలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాల‌ను నిఘా విభాగాల ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. ర‌ఘురామ‌రాజుకు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తే అంద‌రూ దారికొస్తార‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే అదునుచూసి దెబ్బ‌తీసిన‌ట్లుగా ర‌ఘురామ‌రాజును ఆయ‌న పుట్టిరోజునాడే ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ‌ల‌వంతంగా గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి తీసుకెళ్లి అర్థ‌రాత్రి వ‌ర‌కు ఆయ‌నపై ప్ర‌శ్న‌లవ‌ర్షం కురిపించారు. ర‌ఘురామ అరెస్టుతో ఇన్నాళ్లు సొంత ఎంపీనే పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌న్న అప‌వాదును తిడిపేయ‌డంతో పాటు, సొంత పార్టీలోని అస‌మ్మ‌తి వ‌ర్గానికి జ‌గ‌న్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..

ర‌ఘురామ అరెస్టు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం.. ఆ ఎంపీకి ఫోన్లు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>