PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan21468dd7-9dd8-4ab4-8f75-18e0f9ce19da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan21468dd7-9dd8-4ab4-8f75-18e0f9ce19da-415x250-IndiaHerald.jpgగతంలో టీడీపీ అధికారంలో ఉండగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు షాక్ ఇచ్చి, చంద్రబాబు జై కొట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అప్పుడు 23 మందిని లాక్కోవడం వల్లే, 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు గెలుచుకుందని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని జగన్‌తో సహ పలువురు వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అది దేవుడి స్క్రిప్ట్ అవునో, కాదో తెలియదు గానీ, అప్పుడు వైసీపీని వీడి టీడీపీలో చేరినవారు ఇప్పుడు మాత్రం బాగానే బాధపడుతున్నారు.jagan;deva;jeevitha rajaseskhar;jagan;2019;k s ravikumar;minister;tdp;ycp;gottipati ravi kumar;jaggampeta;petta;partyజగన్ మీద బెంగ పెట్టుకున్న టీడీపీ సీనియర్...ఆ ఛాన్స్ మిస్ అయిందా?జగన్ మీద బెంగ పెట్టుకున్న టీడీపీ సీనియర్...ఆ ఛాన్స్ మిస్ అయిందా?jagan;deva;jeevitha rajaseskhar;jagan;2019;k s ravikumar;minister;tdp;ycp;gottipati ravi kumar;jaggampeta;petta;partySat, 15 May 2021 02:00:00 GMTగతంలో టీడీపీ అధికారంలో ఉండగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు షాక్ ఇచ్చి, చంద్రబాబు జై కొట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అప్పుడు 23 మందిని లాక్కోవడం వల్లే, 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు గెలుచుకుందని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని జగన్‌తో సహ పలువురు వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అది దేవుడి స్క్రిప్ట్ అవునో, కాదో తెలియదు గానీ, అప్పుడు వైసీపీని వీడి టీడీపీలో చేరినవారు ఇప్పుడు మాత్రం బాగానే బాధపడుతున్నారు.


అసలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారిలో మళ్ళీ గెలిచింది. ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రమే. మిగతా వారు జగన్ వేవ్‌లో చిత్తుగా ఓడిపోయారు. అయితే కొందరు ఎన్నికల ముందే సీటు రాకపోయినా సరే వైసీపీలోకి వెళ్లారు. ఇక వారి గురించి పక్కనబెట్టేస్తే, టీడీపీలోకి వచ్చి ఓడిపోయినవారు మాత్రం ఇప్పుడు గట్టిగానే బాధపడుతున్నారు. అలా పార్టీ మారి తప్పు చేశానని బాధపడే వారిలో సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఖచ్చితంగా ఉంటారనే చెప్పొచ్చు.


టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన నెహ్రూ ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి, అక్కడ దెబ్బతిని, అటు నుంచి వైసీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి గెలిచారు. అయితే అప్పుడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా నెహ్రూ ఆ పార్టీలోకి వచ్చేశారు.


నెహ్రూకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి బాబు పార్టీలోకి తీసుకున్నారు. కానీ బాబు, నెహ్రూకు షాక్ ఇచ్చి, వేరేవాళ్ళకు పదవి ఇచ్చారు. అయినా సరే అధికారంలో ఉండటంతో నెహ్రూకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నెహ్రూ చిత్తుగా ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి నెహ్రూ టీడీపీలో దూకుడు ఏమి ఉండటం లేదు. ఇక ఈమధ్య ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలు నెహ్రూ వైసీపీలో ఉంటే, ఎమ్మెల్యేగా గెలిచేవారు, అలాగే జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చేవారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారట. ఇక ఇదే అసంతృప్తి నెహ్రూకు కూడా ఉందని తెలుస్తోంది. ఏదేమైనా పార్టీ మారడం వల్ల నెహ్రూకు బాగానే డ్యామేజ్ జరిగింది.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?

ర‌ఘురామ అరెస్టులో హైడ్రామా... ఎక్క‌డ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>