MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-ram-pothineni049e40e7-8cef-462a-91ef-6d34c703541d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-ram-pothineni049e40e7-8cef-462a-91ef-6d34c703541d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తొలిసారిగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని హీరోగా రామ్ కి బాగా పేరు తెచ్చి పెట్టింది. అనంతరం సుకుమార్ తీసిన జగడం ఫ్లాప్ కాగా ఆపై శ్రీనువైట్లతో రామ్ నటించిన రెడీ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా రామ్ కి యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో బాగా క్రేజ్ తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన రామ్ మధ్యలో పలు విజయవంతమram-pothineni;kumaar;choudary actor;puri jagannadh;ram pothineni;shankar;srinivas;sukumar;trivikram srinivas;tollywood;cinema;media;audience;ismart shankar;blockbuster hit;heroine;yuva;silver screen;ileana d'cruz;mass;redఅదే నిజమైతే ఈరోజు అప్ డేట్ వచ్చేదిగా .... ప్చ్ ... ఇక లేనట్లే .... ??అదే నిజమైతే ఈరోజు అప్ డేట్ వచ్చేదిగా .... ప్చ్ ... ఇక లేనట్లే .... ??ram-pothineni;kumaar;choudary actor;puri jagannadh;ram pothineni;shankar;srinivas;sukumar;trivikram srinivas;tollywood;cinema;media;audience;ismart shankar;blockbuster hit;heroine;yuva;silver screen;ileana d'cruz;mass;redSat, 15 May 2021 20:31:00 GMTటాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తొలిసారిగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని హీరోగా రామ్ కి బాగా పేరు తెచ్చి పెట్టింది. అనంతరం సుకుమార్ తీసిన జగడం ఫ్లాప్ కాగా ఆపై శ్రీనువైట్లతో రామ్ నటించిన రెడీ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా రామ్ కి యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో బాగా క్రేజ్ తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన రామ్ మధ్యలో పలు విజయవంతమైన సినిమాలు చేసారు.

తన ఆకట్టుకునే యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ లతో అదరగొడుతూ దూసుకెళ్తున్న రామ్ ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఆపై రామ్ డ్యూయల్ రోల్ రోల్ పోషించిన రెడ్ సినిమా విడుదలై యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితం కానున్న మూవీ లో నటించనున్నారు రామ్. ఇక నేడు రామ్ బర్త్డే కావడంతో పలువురు ఆయన అభిమానులు సినిమా ప్రముఖులు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్సినిమా చేయనున్నారు అంటూ కొద్దీ రోజుల నుంచి ఒక వార్త మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అలానే ఆ మూవీ అధికారిక ప్రకటన రామ్ బర్త్డే రోజు వస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే నేడు ఆ మూవీకి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటకు రాకపోవటంతో పాటు అసలు ఇప్పట్లో రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్స్ లేదని ఇన్నర్ వర్గాల టాక్. మరోవైపు రామ్ ఒక యువ దర్శకుడితో కూడా ఒక సినిమా చేయడానికి ఇప్పటికే కమిట్ అయ్యారని త్వరలో దానికి సంబంధించి అధికారిక న్యూస్ వెలువడనుందని అంటున్నారు. మరి రామ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ మూవీ అసలు ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొరటాలతో బన్నీ కష్టమే.. లైన్లోకి యంగ్ హీరో ?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>