PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-1950fd505d-92a0-48bc-b34c-35f55701b5d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-1950fd505d-92a0-48bc-b34c-35f55701b5d5-415x250-IndiaHerald.jpg కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు వస్తున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా కరోనా కట్టడి కావడం లేదు. ఇదే సమయంలో దేశమంతటా పెరుగుతున్న ఆక్సిజన్ సంక్షోభం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ ఆక్సిజన్..covid-19;delhi;arvind kejriwal;rbi;chief minister;oxygen;houseరాష్ట్రంలో ఆక్సిజన్ బ్యాంకులు.. 2 గంటల్లోనే..రాష్ట్రంలో ఆక్సిజన్ బ్యాంకులు.. 2 గంటల్లోనే..covid-19;delhi;arvind kejriwal;rbi;chief minister;oxygen;houseSat, 15 May 2021 15:00:14 GMTన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు వస్తున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా కరోనా కట్టడి కావడం లేదు. ఇదే సమయంలో దేశమంతటా పెరుగుతున్న ఆక్సిజన్ సంక్షోభం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రాణవాయువు అందక మరణించిన వారి సంఖ్య వేలకు చేరుతున్నాయి.


అయితే ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడంతో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ ఆక్సిజన్ కొరత కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని ఆక్సిజన్ కొరత తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరికొత్త ఆలోచన చేశారు. ఈ మేరకు మాట్లాడిన కేజ్రీవాల్ తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇందు కోసం రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
 

దీంతో ఆక్సిజన్ కొరత వల్ల జరుగుతున్న మరణాలను తగ్గించవచ్చని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. దాదాపు 200 కాన్సంట్రేటర్లతో ఈ  ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటి ద్వారా ఇళ్లలో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారికి కావలసిన ఆక్సిజన్‌ను అందించ గలుగుతామని ఆయన అన్నారు. ఆక్సిజన్ కావలసిన వారికి కేవలం రెండు గంటల్లో హోమ్ డెలివరీ అవుతుందని, డెలివరీ అయిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను ఎలా వాడాలని బాధితులకి అర్థం అయ్యేలా చెప్పేందుకు తమ అధికారి కూడా వస్తాడని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైద్యులు కూడా రోగులకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>