PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse233e058-c5e1-46c4-9077-362b38e4cf0e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse233e058-c5e1-46c4-9077-362b38e4cf0e-415x250-IndiaHerald.jpgభారత్‌ను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ఇండియాలో రోజూ నాలుగువేల మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. కరోనా కొత్త కేసులు, మరణాల గురించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రోజూ బులిటిన్లు విడుదల చేస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగా కేంద్రం రోజూ దేశంలో కరోనా పరిస్థితిపై నివేదక విడుదలు చేస్తుంటుంది. అయితే ఈ నివేదికలు నిశితంగా గమనిస్తే.. అసలు సమాజంలో ఉన్న పరిస్థితికి నివేదికలకు పొంతన కనిపించదు. ప్రభుత్వం కావాలనే కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తుందే అన్న అనుమానం చాలా మందిలో ఉంcoronavirus;health;india;russia;italy;american samoa;central government;internationalభారత్‌లో కరోనా చావులపై వాషింగ్టన్‌ సంస్థ షాకింగ్‌ రిపోర్ట్భారత్‌లో కరోనా చావులపై వాషింగ్టన్‌ సంస్థ షాకింగ్‌ రిపోర్ట్coronavirus;health;india;russia;italy;american samoa;central government;internationalSat, 15 May 2021 00:00:00 GMTభారత్‌ను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ఇండియాలో రోజూ నాలుగువేల మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. కరోనా కొత్త కేసులు, మరణాల గురించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రోజూ బులిటిన్లు విడుదల చేస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగా కేంద్రం రోజూ దేశంలో కరోనా పరిస్థితిపై నివేదిక విడుదల చేస్తుంటుంది. అయితే ఈ నివేదికలు నిశితంగా గమనిస్తే.. అసలు సమాజంలో ఉన్న పరిస్థితికి నివేదికలకు పొంతన కనిపించదు.

ప్రభుత్వం కావాలనే కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తుందేమో అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బయటపెట్టింది వాషింగ్టన్‌కు సంబంధించిన సంస్థ. కరోనా మరణాలపై ప్రభుత్వాలు విడుదల చేస్తున్న గణాంకాలు తప్పుల తడకేనని.. వాస్తవ గణాంకాలు అంతకు రెండు రెట్లు ఎక్కువగా ఉండి ఉంటాయని అమెరికాకి చెందిన సంస్థ ఓ షాకింగ్ రిపోర్టు విడుదల చేసింది.

ఇంతకీ ఆ సంస్థ ఏంటంటారా.. అదే  వాష్టింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ. కరోనా మరణాలను అనేక దేశాలు తక్కువగా చూపాయని ఈ సంస్థ అధ్యయనం చెబుతోంది.  ప్రపంచవ్యాప్తంగా దేశాలు ప్రకటించిన మరణాల కంటే కరోనా మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని వాష్టింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేస్తోంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యాలతో పాటు భారత్ కూడా కరోనా మరణాలను తక్కువ చేసి చూపి ఉండొచ్చంటోంది.

ఇండియా విషయానికి వస్తే.. దాదాపు 4.3 లక్షల మరణాలను తక్కువగా చూపించారని ఈ సంస్థ భావిస్తోంది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ మరణాల సంఖ్య తక్కువగా చూపినట్లు ఈ అధ్యయనం చెబుతోంది. అమెరికాలో సుమారు 3.4 లక్షల మరణాలను తగ్గించి చూపించారట. ఇక రష్యాలో సుమారు 5.93 లక్షల మరణాలను రష్యా తక్కువగా చూపినట్లు ఈ సంస్థ స్టడీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ చెప్పుకుంటోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ లేకపోతే బాబుకు కష్టమేనా...తోకలతో బండి లాగుతారా?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>