Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan60036f94-495a-4d39-b982-f723df0a2f97-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan60036f94-495a-4d39-b982-f723df0a2f97-415x250-IndiaHerald.jpgకొన్నేళ్ల క్రితం సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్. అయితే మళ్లీ మూడేళ్ల తరువాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి తొలి అడుగుతోనే సూపర్ హిట్ కొట్టారు. ఆయన ఇటీవల నటించిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత కూడా పవన్ మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. దగ్గుబాని రానాతో కలిసి మళయాళ సినిమా..pawan kalyan;beauty;pawan;nidhhi agerwal;krish;nidhi;pawan kalyan;rani;telangana;bollywood;cinema;telugu;interview;blockbuster hit;chitramఓకే అంటే రెడీ.. పవన్ కోసం బాలివుడ్ బ్యూటీ వెయిటింగ్ఓకే అంటే రెడీ.. పవన్ కోసం బాలివుడ్ బ్యూటీ వెయిటింగ్pawan kalyan;beauty;pawan;nidhhi agerwal;krish;nidhi;pawan kalyan;rani;telangana;bollywood;cinema;telugu;interview;blockbuster hit;chitramSat, 15 May 2021 22:29:00 GMTపవన్ కల్యాణ్. అయితే మళ్లీ మూడేళ్ల తరువాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి తొలి అడుగుతోనే సూపర్ హిట్ కొట్టారు. ఆయన ఇటీవల నటించిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత కూడా పవన్ మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. దగ్గుబాని రానాతో కలిసి మళయాళ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు పవన్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ తన 27వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 'హరిహర వీరమల్లు' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్‌, పవర్‌ఫుల్‌ కథతో రూపొందుతోందని, తెలంగాణ రాబిన్ హుడ్ సాయి కథతో తెరకెక్కుతోందని టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలోనే ఆగిపోయింది.

వకీల్ సాబ్ ప్రమోషన్స్, సాగర్ చంద్ర సినిమాలో కొంత భాగం కంప్లీట్ చేయటం కోసం పవన్ తన డేట్స్ కేటాయించడంతో ఈ వీరమల్లు షూటింగ్ నిలిచిపోయిందని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయాయి. ఈ చిత్రంలో మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమాలో పవన్.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉండే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

కాగా.. పవన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పాటు నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ బాలీవుడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలను వెల్లడించింది. తాను పవన్ కల్యాణ్ సినిమా కోసం చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానని, షూటింగ్‌లో పాల్గొనటానికి క్రిష్ నుంచి పిలుపు ఎప్పుడొస్తుందా అనేదే తన ఆలోచన అని చెప్పింది.
 
ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ రాణి పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా నిలుస్తుందని, అందుకే ఆమె అంత ఆత్రుతగా ఎదురు చూస్తోందని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ చేయనుందని తెలిసిపోతోంది. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో జాక్వెలిన్ నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>