HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tips-membranes16c7ca04-1e45-4620-b4e6-379e6ee330a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tips-membranes16c7ca04-1e45-4620-b4e6-379e6ee330a0-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వైర‌స్ సోకిన వెంట‌నే నేరుగా ఊపిరితిత్తుల‌పైనే దాడి చేస్తోంది. ఇటువంటి త‌రుణంలో ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే యాల‌కులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ ప్ర‌భావం వ‌ల్ల ఇత‌ర‌త్రా ఇన్‌ఫెక్ష‌న్స్ కూడా వ‌స్తుండ‌టంతో ప‌లు స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. యాల‌కులు ఈ ఇన్‌ఫెక్ష‌న్స్ త‌గ్గిస్తాయ‌ని, నిత్యం తీసుకుంటుండాల‌ని సూచిస్తున్నారు. జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచి ల‌భించే యాల‌కులు మ‌న‌దేశంతోపాటు భూటాన్, నేపాల్, ఇండోనhealth tips, membranes;nithya new;nepal;bhutan;ayurveda;pneumonia;shaktiఊపిరితిత్తుల‌ను కాపాడుతున్న యాల‌కులు??ఊపిరితిత్తుల‌ను కాపాడుతున్న యాల‌కులు??health tips, membranes;nithya new;nepal;bhutan;ayurveda;pneumonia;shaktiSat, 15 May 2021 12:36:16 GMT
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వైర‌స్ సోకిన వెంట‌నే నేరుగా ఊపిరితిత్తుల‌పైనే దాడి చేస్తోంది. ఇటువంటి త‌రుణంలో ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే యాల‌కులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ ప్ర‌భావం వ‌ల్ల ఇత‌ర‌త్రా ఇన్‌ఫెక్ష‌న్స్ కూడా వ‌స్తుండ‌టంతో ప‌లు స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. యాల‌కులు ఈ ఇన్‌ఫెక్ష‌న్స్ త‌గ్గిస్తాయ‌ని, నిత్యం తీసుకుంటుండాల‌ని సూచిస్తున్నారు. జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచి ల‌భించే యాల‌కులు మ‌న‌దేశంతోపాటు భూటాన్, నేపాల్, ఇండోనేషియాలో కూడా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకున్నే యాలకులు... ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోస్థానంలో ఉంటాయి. కుంకుమపువ్వు, వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి.

ఆస్తమాకి విరుగుడు..
కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని ప్ర‌తిరోజు తీసుకుంటుండాలి. ఇవి రక్త ప్రసరణను తేలిక చేసి... ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. కఫాన్ని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి ఉప‌యోగిస్తుంటారు.

ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది..
యాలకుల్లో సీన్సేవుల్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. దీనిలో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. దీంతోపాటు యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉండ‌టంతో ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంచుతుంది. ఆస్తమా రోగుల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
యాలకుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. కాలుష్యం నుంచి కూడా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యల్ని దరి చేరకుండా ఉంచుతుంది.

డిప్రెషన్‌కి సరైన మందు..
క‌రోనాతో కొద్దిరోజులు ఒంట‌రిగా ఉండ‌టంవ‌ల్ల చాలామంది డిప్రెష‌న‌ల్‌లోకి వెళుతున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన ఆలోచ‌న‌లు కూడా చేస్తున్నార‌ని ఓ స‌ర్వేలో తేలింది. ఇటువంటి నెగెటివ్ ఆలోచ‌న‌ల‌నుంచి యాల‌కులు మ‌న‌ల్ని కాపాడ‌తాయి. ప్ర‌తిరోజు యాల‌కుల టీ తాగితే చ‌క్క‌టి ఫ‌లితాలు క‌నిపిస్తాయ‌ని ఆయుర్వేద వైద్య‌నిపుణులు చెబుతున్నారు.

యాలకులు ఎలా తీసుకోవాలి ?
వివిధ రకాలుగా మనం యాలకులు తీసుకోవచ్చు. కావాలంటే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. కేవలం రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>