PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-rama-krishna0a3e878c-e531-491f-9164-cd29ec0c3a97-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-rama-krishna0a3e878c-e531-491f-9164-cd29ec0c3a97-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ రేటు విషయంలో గాని ఆర్ధిక పరిస్థితి విషయంలో గాని తెలుగుదేశం పార్టీ కీలక ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ 2దశల్లో చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. తొలిదశలో ఏపి ఆర్ధిక వృద్దిరేటు 4.3%కు పడిపోయింది అని అన్నారు. కరోనా రెండో దశలో ఏపిలో నెగటివ్ గ్రోత్ ఖాయం అని ఆయన స్పష్టం చేసారు. 2021-22 వృద్దిరేటు ఇప్పటికే 0.3%కు పతనమైంది అని ఆయన ఆరోపించారు. రెండేళ్ల జగన్ పాలన రాష్ట్yaanamala ramkrishndu,tdp,ap;ramakrishna;telugu desam party;jagan;andhra pradesh;telugu;kanna lakshminarayana;tdp;partyఏపీ ఆర్ధిక పరిస్థితి ఇంత దారుణమా...?ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇంత దారుణమా...?yaanamala ramkrishndu,tdp,ap;ramakrishna;telugu desam party;jagan;andhra pradesh;telugu;kanna lakshminarayana;tdp;partySat, 15 May 2021 11:18:55 GMTఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ రేటు విషయంలో గాని ఆర్ధిక పరిస్థితి విషయంలో గాని తెలుగుదేశం పార్టీ కీలక ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ 2దశల్లో చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. తొలిదశలో ఏపి ఆర్ధిక వృద్దిరేటు 4.3%కు పడిపోయింది అని అన్నారు. కరోనా రెండో దశలో ఏపిలో నెగటివ్ గ్రోత్ ఖాయం అని ఆయన స్పష్టం చేసారు. 2021-22 వృద్దిరేటు ఇప్పటికే 0.3%కు పతనమైంది అని ఆయన ఆరోపించారు.

రెండేళ్ల జగన్ పాలన రాష్ట్రంపై కనీవినీ ఎరుగని దుష్ప్రభావం పడిందని అన్నారు. కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఏపికి చేటు చేసింది,కీడు వాటిల్లింది అని మండిపడ్డారు. తయారీ రంగంపై పూర్తి నిర్లక్ష్యం, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడంపై అశ్రద్ద చూపించారు అంటూ మండిపడ్డారు. నిరుద్యోగ రేటు ఇప్పటికే 10%కు చేరింది, భవిష్యత్ లో 20%కు దిగజారడం తథ్యం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అభివృద్దికి గండికొట్టారు, పేదల ఉపాధిని, రాబడులను చావు దెబ్బతీశారు అని విమర్శలు చేసారు.

అనేకమంది ఉద్యోగాలు ఊడగొట్టారు, వలస కార్మికుల పొట్టకొట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా రెండోదశతో ఏపిలో తిరోగమన వృద్ది ఖాయం అని అన్నారు. ద్రవ్యలోటు, ఆదాయలోటు, అధిక అప్పులే జగన్ ఘనత అని 2021-22 ప్రతిపాదిత బడ్జెట్ తప్పుడు లెక్కలే తప్ప రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టేది కాదు అని వ్యాఖ్యానించారు. ఈ ఆర్ధిక సంక్షోభం దుష్ఫలితాలతో మరో 3ఏళ్లు రాష్ట్రం అతలాకుతలం అయిందని మండిపడ్డారు. కోలుకోలేని దుస్థితికి ఏపిని  దిగజార్చిన ఘనత జగన్ దే అని విమర్శించారు. 5ఏళ్ల జగన్ పాలనలో ఏపి అభివృద్ది పూర్తిగా రివర్స్, అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ అధోగతే అని మండిపడ్డారు. అటు అభివృద్దిలో, ఇటు పేదల సంక్షేమంలో, ఉపాధిలో అంతా రివర్స్ చేశారు అని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>