MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/twaralone-akhanda-movie-nunchi-song41168aa1-6c65-4546-bf49-202cdd3d7d83-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/twaralone-akhanda-movie-nunchi-song41168aa1-6c65-4546-bf49-202cdd3d7d83-415x250-IndiaHerald.jpgఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీస్థాయి పరాజయాలని చవిచూశారు బాలయ్య. అయితే ఆ సినిమాల్లో బాలయ్య నటనకు అందరి నుంచి మంచి పేరు దక్కినప్పటికీ ఆ సినిమాల యొక్క కథ, కథనాలు ఆసక్తికరంగా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఆయా సినిమాల పరాజయాలకు ముఖ్య కారణం అని అంటున్నారు విశ్లేషకులు. balayya;business;ntr;balakrishna;boyapati srinu;geetha;krish;pragya jaiswal;thaman s;cinema;sangeetha;k s ravikumar;audience;director;heroine;ruler;success;gottipati ravi kumar;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;massఫ్లాప్స్ పడినా ... బాలయ్యకు బాగానే ముట్టిందంటున్నారు ..... ??ఫ్లాప్స్ పడినా ... బాలయ్యకు బాగానే ముట్టిందంటున్నారు ..... ??balayya;business;ntr;balakrishna;boyapati srinu;geetha;krish;pragya jaiswal;thaman s;cinema;sangeetha;k s ravikumar;audience;director;heroine;ruler;success;gottipati ravi kumar;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;massSat, 15 May 2021 00:23:00 GMTఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీస్థాయి పరాజయాలని చవిచూశారు బాలయ్య. అయితే ఆ సినిమాల్లో బాలయ్య నటనకు అందరి నుంచి మంచి పేరు దక్కినప్పటికీ ఆ సినిమాల యొక్క కథ, కథనాలు ఆసక్తికరంగా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఆయా సినిమాల పరాజయాలకు ముఖ్య కారణం అని అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ సినిమాల అనంతరం సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా రూలర్. గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. మంచి మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వం లో నటిస్తున్న మూవీ అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మధ్యతరగతి రైతుగా అలానే అఘోర గా రెండు రకాల పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే.

ఈ రెండు పాత్రలకు సంబంధించిన ఇటీవల విడుదలైన టీజర్స్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని అలానే ముఖ్యంగా ఈ సినిమాకు గాను బాలయ్య కు ఏకంగా రూ. 17 కోట్ల రూపాయల వరకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ముట్టిందని, ఇది బాలయ్య కెరీర్ లో అత్యధికం అని అంటున్నారు. ఇటీవల బాలయ్య నటిస్తున్న సినిమాలు వరుసగా పరాజయాలు పాలవుతున్నప్పటికీ కూడా ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకోవటానికి కారణం ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, చరిష్మా అని, తప్పకుండా ఈ మూవీతో బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టి బాలయ్య కెరీర్ పరంగా బ్రేక్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. కాగా ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైఎస్సార్ క్యాంటీన్...బాబుకి ప్లస్ అవుతుందా?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>