PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronavirus6db3a0d7-d8ab-497a-bff0-2625c5cb0b65-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronavirus6db3a0d7-d8ab-497a-bff0-2625c5cb0b65-415x250-IndiaHerald.jpgఈ సమాజములో జీవిస్తున్న ఒక మనిషిగా మనము ప్రస్తుత పరిస్థితిని ఆకలింపు చేసుకుని ప్రవర్తించాలి. అప్పుడే మనిషి జీవితానికి నిజమైన అర్ధం ఉంటుంది. ఎందుకంటే రెండు సంవత్సరాల నుండి కరోనా అనే ఒక వైరస్ మానవ జీవితాన్ని నాశనం చేస్తోంది. వయసు తారతమ్యం లేకుండా, స్థాయి బేధం లేకుండా అందరినీ తన కాటుకు బలయ్యేలా చేస్తోంది. CORONAVIRUS;mandula;bari;letter;oxygen;coronavirusమూడు నెలలు జాగ్రత్త ... మీ ప్రాణాలకు మాది భరోసా ?మూడు నెలలు జాగ్రత్త ... మీ ప్రాణాలకు మాది భరోసా ?CORONAVIRUS;mandula;bari;letter;oxygen;coronavirusSat, 15 May 2021 13:32:05 GMTఈ సమాజములో జీవిస్తున్న ఒక మనిషిగా మనము ప్రస్తుత పరిస్థితిని ఆకలింపు చేసుకుని ప్రవర్తించాలి. అప్పుడే మనిషి జీవితానికి నిజమైన అర్ధం ఉంటుంది. ఎందుకంటే రెండు సంవత్సరాల నుండి కరోనా అనే ఒక వైరస్ మానవ జీవితాన్ని నాశనం చేస్తోంది. వయసు తారతమ్యం లేకుండా, స్థాయి బేధం లేకుండా అందరినీ తన కాటుకు బలయ్యేలా చేస్తోంది. ఇది ప్రపంచానికే ఒక సవాలుగా మారింది. మనిషి జ్ఞానానికి మరియు కంటికి కనిపించని ఒక వైరస్ బలానికి మధ్యన జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్పవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గినా, మన దేశంలో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు దీనికి సరైన మందు కనిపెట్టలేకపోయినా తాత్కాలిక ఉపశమనం కోసం కొన్ని మందులు మరియు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం కరోనా రోగులు హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆక్సిజన్  కొరత సమస్య కూడా భవిష్యత్తులో తీరిపోయే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం తగు ప్రణాళికలను రచిస్తోంది. అంతే కాకుండా  రెండేసివెర్ ఇంజక్షన్ సమస్య కూడా దాదాపుగా తీరిపోయింది. ఇకపోతే వ్యాక్సినేషన్ కార్యక్రమం. వ్యాక్సిన్ స్టాక్ లేకపోవడం వలన అందరికీ వ్యాక్సిన్ వేయడం కుదరలేదు. ఈ సమస్య కూడా అతి త్వరలోనే తీరిపోనుంది. అయితే ఇవన్నీ మూడు నెలలు పాటు మనమంతా జాగ్రత్తగా ఉంటే జరుగుతాయి. కరోనాను ఆపడంలో మానవునిగా మన బాధ్యత ఏమైనా ఉందా ? అంటే ఖచ్చితంగా ఉంది. ఒక మామూలు మనిషిగా కరోనాను నియంత్రించడంలో మన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వైరస్ ముఖ్యంగా మన నోటిలో నుండి వచ్చే తుంపర్ల ద్వారా ఎదుటివారికి వ్యాపిస్తోంది. ఇలా కరోనా వ్యాప్తి జరగకుండా ఉండాలంటే ? ఒక మూడు నెలల పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ మహమ్మారి కరోనా వైరస్ బారి నుండి బయటపడవచ్చు అని ప్రభుత్వాలు మరియు వైద్య నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలివే ...


1. ఇప్పుడు ఎలాగూ లాక్ డౌన్ నడుస్తోంది, కాబట్టి మీరు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ప్రాణాపాయ పరిస్థితికి మించిన అవసరం ఉండదని భావిస్తున్నాము. ఏ అవసరమూ మన ప్రాణాలకన్నా విలువైనది కాదు అని నమ్మండి.

2. ఒకవేళ మీరు బయటకు వస్తే, ఖచ్చితంగా ఇంటిలో నుండి బయటకు వచ్చే ముందే మాస్కును ధరించండి. శానిటైజర్ ను మీ చేతులకు అప్లై చేసుకోండి. ఈ రెండు పనులు చేయకుండా వచ్చారంటే, చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి.

3. బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి మీకు ఖచ్చితంగా ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించండి. దీని వలన ఆ ఎదుటి వ్యక్తికి కరోనా ఉంటే మీకు సోకకుండా ఉంటుంది.

4. పొరపాటున కూడా బయటకు వెళ్ళినప్పుడు వ్యక్తులతో మాట్లాడకండి. ఇలా చేస్తే మాట్లాడే సమయంలో ఒకవేళ అవతలి వారు  మాస్కును ధరించకపోతే ఆ తుంపరలు మీపై పడే అవకాశం ఉంటుంది.

5. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా అన్నిటినీ ఈ మూడు నెలలు పక్కన పెట్టేయండి.

ఈ జాగ్రత్తలన్నీ కట్టుదిట్టంగా ఇంకో మూడు నెలలు పాటిస్తే, వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ధీమాగా ఉండొచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రేక్షకులను మాయ చేసిన ఏమాయ చేశావే సినిమా..!

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>