Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf4e2aba7-cdba-4060-82d9-9078684cc9d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf4e2aba7-cdba-4060-82d9-9078684cc9d4-415x250-IndiaHerald.jpgఓవైపు దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే ఈ మహమ్మారి వైరస్ స్పీడ్ కి కళ్లెం వేసేందుకు అటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా జరుపుతున్నాయి. వాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలను పెంచి ఆ తర్వాత వైరస్ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ దశలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలCorona;central government;pregnant;coronavirusమొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలంటే?మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలంటే?Corona;central government;pregnant;coronavirusFri, 14 May 2021 13:16:16 GMTఓవైపు దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే ఈ మహమ్మారి వైరస్ స్పీడ్ కి కళ్లెం వేసేందుకు అటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా జరుపుతున్నాయి.  వాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలను పెంచి ఆ తర్వాత వైరస్ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే వివిధ దశలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి ప్రభుత్వాలు.  అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతూ ఉన్నారు.  ఇలాంటి నేపథ్యంలో మళ్లీ అందరిలో ఎన్నో అపోహలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.



 ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి అన్న దానిపై చాలామందికి క్లారిటీ లేదు.అయితే ఇటీవలే ఈ విషయం పై నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు రెండు నెలల వరకు వ్యాక్సిన్ తీసుకోవద్దు అంటూ నిపుణులు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ప్యానల్ కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారు మొదటి డోస్ రెండవ డోస్ కి మధ్య సమయం 12 నుంచి 16 వారాలు ఉంచాలని  సూచించారు.



 అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవచ్చో నిర్ణయించుకోవచ్చని  ఇటీవలే నిపుణుల కమిటీ తెలిపింది. మహిళలు ప్రసవం తర్వాత కూడా పిల్లలకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్  తీసుకోవచ్చు అంటూ నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒక వేళ కరోనా పాజిటివ్ వస్తే ఇక వైరస్ నుంచి కోలుకున్నాక 4 నుంచి 8 వారాల వరకు వేచి ఉండాలి అంటూ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక ప్లాస్మా చికిత్స ద్వారా వైరస్ నుంచి కోలుకున్న బాధితులు మూడు నెలల వరకు టీక వేసుకోవడాన్ని వాయిదా వేసుకోవాలి అని సూచించింది అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా 4 నుంచి 8 వారాల వరకు రెండవ డోస్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు నిపుణులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>