MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suneel-movie-carrerf86c5319-1271-4c77-9935-717ad6aa42c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suneel-movie-carrerf86c5319-1271-4c77-9935-717ad6aa42c9-415x250-IndiaHerald.jpgహాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు సునీల్‌. ఆ  తర్వాత హీరోగా ప్రమోషన్ పొంది తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో తడబడ్డారు. కానీ తప్పుకోలేదు. వరస ప్లాఫ్ లు రావటంతో .. ఇటీవల కాలంలో మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్స్ ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయనలో హీరోగా చేయాలనే కోరిక పోలేదు.అయితే ఈ విషయాన్ని ఆయన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ గమనించారో ఏమో ఆయనని మళ్ళీ హీరోగా చేస్తున్నారు. ఎలా అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేశsunil;mahesh;rajinikanth;anil music;anil sunkara;srinivas;sunil;trivikram srinivas;cinema;tamil;sunkara ramabrahmam;remake;hero;success;aravinda sametha veera raghava;khaleja;chitramసునీల్ ని మళ్ళీ హీరో చేస్తున్న త్రివిక్రమ్...సునీల్ ని మళ్ళీ హీరో చేస్తున్న త్రివిక్రమ్...sunil;mahesh;rajinikanth;anil music;anil sunkara;srinivas;sunil;trivikram srinivas;cinema;tamil;sunkara ramabrahmam;remake;hero;success;aravinda sametha veera raghava;khaleja;chitramFri, 14 May 2021 14:30:00 GMTహాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు సునీల్‌. ఆ  తర్వాత హీరోగా ప్రమోషన్ పొంది తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో తడబడ్డారు. కానీ తప్పుకోలేదు. వరస ప్లాఫ్ లు రావటంతో .. ఇటీవల కాలంలో మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్స్ ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయనలో హీరోగా చేయాలనే కోరిక పోలేదు.అయితే ఈ విషయాన్ని ఆయన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ గమనించారో ఏమో ఆయనని మళ్ళీ హీరోగా చేస్తున్నారు.

ఎలా అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. వీళ్లద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయినా.. ఇరువురి కెరీర్‌లో క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ‘ఎస్ఎస్ఎమ్‌బీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఇంకొక హీరోకి ఛాన్స్ ఉంది అంట. అయితే త్రివిక్రమ్ వేరే హీరోని తీసుకోవడం ఎందుకు అని సునీల్ ని ఎంపిక చేశారట.

అయితే ప్రస్తుతం సునీల్ హీరోగా సినిమాలు ఆపేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత , అలా వైకుంటాపురంలో లాంటి సినిమాలు చిన్న చిన్న పాత్రలు సునీల్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ సునీల్ కి గుర్తుండిపోయే పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక సునీల్ ప్రస్తుతం తమిళంలో వచ్చిన మండేలా తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు అని టాక్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధినేత అనిల్ సుంకర రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో మండేలా పాత్రలో సునీల్ అయితే బాగుంటారు అని ఫిక్స్ అయ్యారట.  ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!

శ్రీరెడ్డి ఎపిసోడ్ పై పరోక్షంగా స్పందించిన హీరో రానా తమ్ముడు..

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>